చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీ నేతలు విషాదంలో మునిగిపోయారు.. ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు మృతిచెందారు.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో ఈ ప్రమాదం జరిగింది.. బాపట్ల జిల్లా జె పంగులూరు మండలం కొండ మంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీడీపీ నాయకులు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. టీడీపీ ముఖ్య నేతలైన భాను ప్రకాష్‌రెడ్డి, గంగపల్లి భాస్కర్.. ఓ వివాహానికి గుంటూరుకు కారులో బయల్దేరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది..
Read Also: Viral News: దారుణం..బీచ్ లో నగ్నంగా యువతి మొండెం.. తల కోసం పోలీసుల వేట.. చివరికి
ఘటనా స్థలంలో చంద్రగిరి మండల టీడీపీ యూత్ అధ్యక్షుడు భాను ప్రకాష్(31) మృతి చెందాడు.. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన చిత్తూరు పార్లమెంటు కార్యనిర్వహక కార్యదర్శి గంగుపల్లి భాస్కర్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.. ఈ ఘటనతో షాక్ తిన్నాయి టీడీపీ శ్రేణులు.. రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఇంఛార్జ్ పులివర్తి నాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నేతల మృతదేహాలు ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో ఉండగా.. వెంటనే ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు పులివర్తి నాని. ఒకేసారి ఇద్దరు నేతలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం.. ఆ పార్టీలో విషాదాన్ని నింపింది.