TTD Hundi Collection: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.. ఇదే సమయంలో.. శ్రీవారికి కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తారు.. శ్రీవారి హుండీల్లో ప్రతీ రోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్ది బంగారం సమర్పిస్తూనే ఉంటారు భక్తులు.. అయితే, కరోనా సమయంలో.. శ్రీవారి దర్శనాలను రద్దు చేయడంతో.. ఆదాయం తగ్గిపోయింది.. ఇక, మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.. గత ఏడాది కూడా వరుసగా ప్రతి నెల రూ.100 కోట్ల మార్క్ దాటుతూ వచ్చింది శ్రీవారి హుండీ ఆదాయం.. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అవుతోంది.. 2023 జనవరి మాసంలో వంద కోట్ల మార్క్ ని దాటేసింది శ్రీవారి హుండీ ఆదాయం.. జనవరి మాసంలో శ్రీవారి హుండీ ఆదాయం 123 కోట్ల రూపాయలుగా ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇక, జనవరి 2వ తేదీన శ్రీవారికి టీటీడీచరిత్రలో అత్యధిక హుండీ ఆదాయం లభించింది.. 2వ తేదీన ఏకంగా రూ.7.68 కోట్లు శ్రీవారి హుండీలో సమర్పించారు భక్తులు.
Read Also: Gold: పడిపోయిన బంగారం వినియోగం.. కారణం ఇదే..
కాగా, గత ఏడాది అంటే 2022లో శ్రీవారి హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం భారీగా సమకూరింది. 2022లో తిరుమల శ్రీవారికి భక్తులు రూ. 1446 కోట్లు సమర్పించారు.. జనవరి నుంచి డిసెంబర్ వరకు శ్రీవారిని 2.35 కోట్ల మంది భక్తులు దర్శించుకోగా.. 1.08 కోట్ల మంది తలనీలాలు సమర్పించుకున్నారు.. ఇక, అక్టోబర్ లో రూ. 6.30 కోట్ల ఆదాయం సమకూరింది.. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 11,42,78,291 కోట్ల లడ్డూలను భక్తులు విక్రయించారు. కరోనా సమయంలో శ్రీవారి హుండీ ఆదయం భారీగా తగ్గింది. కరోనా కారణంగా దాదాపు 83 రోజుల పాటు శ్రీవారి దర్శనాలు టీటీడీ అధికారులు నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత పరిమిత సంఖ్యలో దర్శనాలు ప్రారంభించారు. ఫస్ట్, సెకండ్ వేవ్ లలో పరిమిత సంఖ్యలో భక్తులు రావడంతో స్వామి వారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ తరువాత భారీగా భక్తులలు రావడంతో గతంలో మాదిరే హుండీ ఆదాయంతో పాటుగా, కళ్యాణ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు వంటి రూపాల్లో ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాదిలోనూ అదే దూకుడు చూపిస్తోంది.