భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు రాష్ట్రపతి.. తాడిగడప పురపాలక సంఘం పరిధిలోని పోరంకి మురళి రిసార్టు ఉంది.. అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పౌర సన్మానానికి ద్రౌపతి ముర్ము హాజరవుతారు. పౌర సన్మానం చేయనున్నారు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సన్మానం అనంతరం విజయవాడలోని రాజ్ భవన్ కు చేరుకుంటారు.. రాష్ట్రపతి గౌరవార్ధం రాజ్ భవన్‌లో అధికారిక విందు ఇవ్వనున్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2.15 నిమిషాల వరకు విందు జరగనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి సహా అతికొద్ది మందికే గవర్నర్ ఆహ్వానం పంపారు.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
విందుకు ముఖ్యమంత్రి, హైకోర్టు సీజే జస్టిస్ పీకే మిశ్రా, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ, ఆర్టీఐ చీఫ్ కమిషనర్, ఏపీపీఎస్సీ ఛైర్మన్ తదితరులు మాత్రమే హాజరుకానున్నారు. ఇక, మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో విశాఖపట్నంకు బయల్దేరనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అయితే, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.. రేపు భారీ మరియు గూడ్స్ వాహనములకు అనుమతిలేదని స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ మళ్లించనున్నారు.. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వాహనములను ఇబ్రహీంపట్నం – జి.కొండూరు – మైలవరం – నూజివీడు – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. విశాఖపట్నం నుండి చెన్నై మధ్య రవాణా వాహనాల రాకపోకలను కూడా మళ్లించనున్నారు.. విశాఖపట్నం నుండి చెన్నై వైపు వెళ్ళే వాహనాలు హనుమాన్ జంక్షన్ – అవనిగడ్డ – రేపల్లె – బాపట్ల – చీరాల – త్రోవగుంట మీదుగా వెళ్లాల్సి ఉండగా.. చెన్నై నుండి విశాఖపట్నం వైపు వాహనాలు ప్రకాశం జిల్లా త్రోవగుంట వద్ద మళ్లించి చీరాల – బాపట్ల – రేపల్లె – అవనిగడ్డ – హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.. ఇక, గుంటూరు నుండి విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనములు బుడంపాడు వద్ద నుండి పొన్నూరు–రేపల్లె –అవనిగడ్డ- హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.