నేను ఫెయిల్డ్ పొలిటీషియన్.. ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం అడుగు దూరం..
తన రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ని అని వ్యాఖ్యానించారు.. అయితే, పవన్ ఆ వ్యాఖ్యలు చేయగానే అక్కడున్న సీఏ స్టూడెంట్స్ ఒక్కసారిగా సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కానీ, దీనిని నేను అంగీకరించాలని, రాజకీయాల్లో ఫెయిల్ అయినందుకు తానేమీ బాధపడడం లేదన్నారు.. అంతేకాదు, ఫెయిల్యూర్ అనేది సక్సెస్ కి సగం అడుగు దూరంలో ఉంటుందని ఆయన చెప్పడంతో.. విద్యార్థులంతా చప్పట్లతో స్వాగతించారు.. సీఏ విద్యార్థుల సమక్షంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. ఓటమితో తాను మరింత నేర్చుకునే అవకాశం ఉంటుందని, మరింత సాధించే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు పవన్ కల్యాణ్.. చాలా మంది సొసైటీలో మార్పు వస్తే బాగుటుంది అనుకుంటారు.. కానీ, కంఫర్టబుల్ ప్లేస్‌లో నుంచి బయటకు రాలేరన్న ఆయన.. తాను మాత్రం అలా ఉండలేనని స్పష్టం చేశారు.. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కనీసం ప్రయత్నించానని అన్నారు పవన్… అందుకు తాను ఓటమి గురించి బాధపడడం లేదని పేర్కొన్నారు.. రాజకీయ నాయకుడిగా ఓడిపోయాను.. కానీ, పెద్దగా బాధపడనని… ఈ సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి శాశ్వతం కాదన్నారు జనసేనాని.. పాసింగ్ క్లౌడ్స్ లాంటివని అన్నారు. సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని ఎక్కువగా మనసుకు తీసుకోకండి అని సూచించారు.. సక్సెస్ వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా.. మన స్పందన మాత్రం ఒకేలా ఉండాలన్నారు.
‘రాయలసీమ గర్జన’కు రాకపోతే వాళ్లు సీమ ద్రోహులే..!
అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.. అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేసితీరుతాం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ఈ ఉద్యమంలో ఆయా ప్రాంతాల ప్రజలను భాగస్వామ్యం చేసేపనిలో పడిపోయింది అధికార పార్టీ.. ఇప్పటికే విశాఖ వేదికగా ఉత్రరాంధ్ర ప్రజలతో జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జనను విజయవంతం చేశారు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. ఇప్పుడు రాయలసీమ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 5న కర్నూలులో రాయలసీమ గర్జన భారీ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. జేఏసీ , వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విధ్యార్థి యువజన సంఘాలు ఈ గర్జనలో పాల్గొంటాయని వెల్లడించారు. పాలన రాజధాని విశాఖలో, అమరావతిలో అసెంబ్లీ, న్యాయరాజధాని కర్నూలులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.. సీఎం జగన్ గర్వంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని ప్రకటించారంటూ కొనియాడరు. పెద్ద నాయకులు కూడా జేఏసీ సభను విమర్శించడం దారుణమని మండిపడ్డారు.. నాయకులు చిన్న తరహా ఆలోచన చేయవద్దు.. మీరూ కలసి రండి, సభకు రాకుంటే వాళ్ళు రాయలసీమ ద్రోహులు అని హెచ్చరించారు.. హైకోర్టు రాయలసీమ హక్కు.. కరువు నివారణకు వైసీపీ ప్రభుత్వం చేయాల్సినవి చేస్తుందన్నారు.. ఇక, హైకోర్టు ఏర్పాటును ఎవరు అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసని మండిపడ్డారు.
సీబీఐకి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు సీబీఐ అధికారులు. అంతేకాకుండా.. మిమ్మల్ని విచారించడానికి మీకు అనుకూలంగా ఉండే మీ నివాసం లేదా.. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఏదో చెప్పాలని కోరింది. ఈనేపథ్యంలో.. ఈ సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. తనకు సీబీఐ నోటీసులు అందాయని… విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. వారి అభ్యర్థన మేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో తనను ప్రశ్నించాలని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చానని వెల్లడించారు కవిత. అంతేకాకుండా.. ఈ మేరకు ఆమె సీబీఐ ఉన్నతాధికారి అలోక్ కుమార్‌కు లేఖ రాశారు. ఎఫ్‌ఐఆర్ కాపీతో పాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు కవిత. ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్‌ఐఆర్‌ను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని కోరిన కవిత.. సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలన్నారు. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే వివరణ తేదీ ఫిక్స్ చేద్దామని కవిత లేఖలో పేర్కొంది కవిత.
స్కూల్స్‌లో ఏ సౌకర్యాలు ఉండవు కానీ.. బెల్ట్ షాపులు మాత్రం బోలేడు
5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్వార్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోనీ దివ్యాంగులతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ముచ్చటించారు. అనంతరం దివ్యాంగులకు బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఅర్ బిడ్డకు సీబీఐ నోటీసులు ఇస్తే మనం పోరాటం చేయాలా.. స్కూల్స్ లో ఏ సౌకర్యాలు ఉండవు కాని బెల్ట్ షాపులు మాత్రం బోలేడు ఉన్నాయని ఆయన విమర్శించారు. రోడ్లు సరిగా లేవు.. తెలంగాణలో ఆకలి చావులు పెరిగినవి.. స్వర్ణ కారులు ఆకలి చావులు.. పేదోల్ల ఉసురు ఊరికనే పోతదా అంటూ ఆయన ధ్వజమెత్తారు. కవితను లేదా ఇంకో అక్కను లేదా అన్నను పట్టుకపోతే రోడ్డు ఎక్కవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం వచ్చాక మళ్లీ వస్తానని ఆయన అన్నారు.
సూపర్ స్టార్ బ్యాక్‌టు వర్క్
ఘట్టమనేని కుటుంబంలో వరుస మరణాలు ప్రిన్స్ మహేష్ బాబును శోకసంద్రంలో ముంచాయి. తండ్రి.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుమారుడు, మహేష్ బాబు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కృష్ణ గారికి సంబంధించిన ఆచార కార్యక్రమాలను మహేష్ పూర్తి చేశాడు. నలుగురితో ఉంటేనే మహేష్ మామూలుగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటే తండ్రి ఆలోచనలతో బాధపడుతున్నాడని సన్నిహితులు చెప్తున్నారు. అయితే మహేష్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇలాంటి ఆపత్కాలంలో దర్శకుడు త్రివిక్రమ్ తోడుగా నిలుస్తున్నాడు. ఆయన వెంటే ఉంటూ మహేష్‌కు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటే మహేష్ మరింత దు:ఖంలోకి వెళ్తాడని, ఆయన్ని సినిమా షూటింగ్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు త్రివిక్రమ్. మహేష్ నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించి సమయం దొరికినప్పుడల్లా మహేష్‌తో మాట్లాడుతున్నాడట. ఇలా మహేష్‌ను విషాదం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం త్రివిక్రమ్ చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్‌ను మహేష్ అభిమానులు అభినందిస్తున్నారట. అయితే, తాజాగా మహేష్‌ను తన నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొనేలా త్రివిక్రమ్ ఆయన్ను రెడీ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ కు బాక్ టూ వర్క్ అంటూ మహేష్ ట్వీట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోకు తామున్నామంటూ ధైర్యం చెబుతున్నారు.
అడివి శేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్
అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు రాబట్టుతోంది. థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన తీరు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. సినీ క్రిటిక్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరుచుతున్నారు. దీంతో ఈ సినిమా తొలిరోజే మంచి వసూళ్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.11.27 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కినట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. హీరో అడివి శేష్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఓపెనింగ్స్ అని ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. హిట్-2 సినిమాకు ఇంత మంచి ఆదరణ అందిస్తూ, ఈ సినిమాను నిజమైన హిట్ చేసిన ప్రేక్షకులకు నిర్మాత నేచురల్ స్టార్ నాని థ్యాంక్స్ చెబుతున్నారు. ఇక హిట్ వర్స్‌లో రాబోయే నెక్ట్స్ మూవీలో హీరోగా నాని నటించబోతున్నట్లు హిట్-2 సినిమాలో చూపెట్టడంతో ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. మరి హిట్-2 సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
ఓయోలోనూ ఉద్యోగాల కోత..
దేశీయ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. బైజూస్, జొమాటో వంటి దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది. అలాగే సేల్స్ విభాగంలో 250 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తున్నట్లు కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓయోలో ప్రధానంగా 3700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి 10 శాతం ఉద్యోగాలు తగ్గించాలని కంపెనీ చూస్తోంది. దానిలో భాగంగా కంపెనీ ఇంజనీరింగ్, కార్పొరేట్ విభాగంలో టీమ్‌లను తగ్గిస్తోంది. సంస్థాగత నిర్మాణంలో విస్తృతమైన మార్పులను అమలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఓయో తెలిపింది. గత రెండేళ్లలో ఓయో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. 2020 డిసెంబర్‌లో కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది.
ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ యూజలర్లకు ఊరట.. వాడుతున్నారా? అయితే మీకు ఊరట..
యూపీఐ డిజిటల్ పైప్‌లైన్‌ను నడుపుతున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ), యూపీఐలోని TPAPల వాల్యూమ్ క్యాప్‌ను 30శాతానికి పరిమితం చేయడానికి గడువును 2024 డిసెంబర్ 31 వరకు రెండేళ్లపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. దీంతో, దాదాపు 80 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఫ్రీచార్జ్ వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్లేయర్‌లకు ఇది ఉపశమనం కలిగిస్తోంది.. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య డిజిటల్ చెల్లింపుల సేవలను ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న విషయం విదితమే కాగా.. ఒక్క థర్డ్ పార్టీ యూపీఐ లావాదేవీల సంఖ్యలో 30 శాతం మించి నిర్వహించకూడదన్న పరిమితిని 2020 నవంబర్‌లో ఎన్పీసీఐ తీసుకొచ్చిన విషయం తెలిసిందిఏ.. అయితే, ఈ నిర్ణయం వాస్తవానికి 2022 జనవరి 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉన్నా.. 2020 నవంబర్ 5 నాటికే సేవలు అందిస్తున్న థర్డ్ పార్టీ యాప్‌లు అయినటువంటి గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి సంస్థలు ఈ నిబంధన అమలు చేసేందుకు ఎన్పీసీఐ రెండేళ్ల గడువు ఇచ్చింది.
కోవిడ్ విషయంలో డబ్ల్యూహెచ్‌వో గుడ్‌న్యూస్..
కరోనా మహమ్మారి కోరల్లో నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు భయాందోళనలను కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో గుడ్‌న్యూస్ చెప్పింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ జనాభాలో 90 శాతం మందిలో కొంత మేర రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని అంచనా వేసింది. వ్యాక్సినేషన్ కారణంగా ప్రపంచంలోని 90 శాతం మందిలో కొవిడ్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వచ్చినట్లు డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. కాకపోతే కొత్త వేరియంట్లు ఉద్భవించే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు.
కామెడీ పండించిన జో రూట్..
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరుగుతున్న ఇంగ్లండ్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టులో రావల్పిండి పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారింది. చారిత్రక టెస్టుగా చెప్పుకుంటూ నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే అనుకులించే పిచ్‌పై ఇరు దేశాల బ్యాటర్లు శతకాలతో రెచ్చిపోతున్నారు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో ఇప్పటికే 7 సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. మూడు సెంచరీలు పాక్ బ్యాటర్లు కొట్టారు. దీంతో తొలి మ్యాచ్‌లో ఫలితం తేలదంటూ క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌పై ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. విమర్శల పాలవుతున్న ఈ టెస్టు మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ కామెడీ పండించాడు. మూడో రోజు ఆటలో భాగంగా పాతబడుతున్న బంతిని మెరిపించేందుకు సరికొత్త పద్దతిని కనిపెట్టాడు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త ట్రిక్‌తో బంతిని మెరిపించే ప్రయత్నం చేశాడు రూట్. తన సహచర ఆటగాడు జాక్ లీచ్ బట్టతలపై బాల్‌ను రుద్ది.. నవ్వులు పూయించాడు. బౌలింగ్ మార్పు కోసం అందరు ఆటగాళ్లు ఒక చోట గుమ్మిగూడిన టైమ్‌లో జాక్ లీచ్ తనపై క్యాప్ తీసిన రూట్.. బాల్‌ను లీచ్ బట్టతలపై సుతిమెత్తగా తిప్పాడు. దీంతో బాల్‌కు అతని బట్టతలపై ఉన్న చెమట అంటింది. మళ్లీ దాన్ని హ్యాండ్ టవల్‌తో గట్టిగా రుద్దుతూ.. బంతిని మెరిపించేందుకు ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాల్‌ను మెరిపించడానికి రూట్ కొత్త పద్ధతి కనిపెట్టాడంటూ పాక్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.