భారత రాష్ట్రపతి హోదాలో తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టబోతున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఆమె పర్యటన కొనసాగనుంది.. తొలి పర్యటనలో రేపు ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన కొనసాగనుంది.. రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరనున్న రాష్ట్రపతి.. ఉదయం 10.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. విమానాశ్రయంలో స్వాగతం పలకున్నారు గవర్నర్, సీఎం వైఎస్ జగన్.. గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా పోరంకి మురళి రిసార్టుకు చేరుకుంటారు…