శతాబ్ధాల నాటి ‘‘సతీ’’ శాపం.. ఈ గ్రామ ప్రజలు ‘‘దీపావళి’’కి దూరం..
దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ‘‘దీపావళి’’ని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. దీపావళికి సంబంధించి కొత్త బట్టలు, టపాసులు, ఇతరత్రా షాపింగ్ జోరుగా సాగుతోంది. తమ కుటుంబాలతో ఆనందంగా పండగను సెలబ్రేట్ చేసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ గ్రామం, గ్రామ ప్రజలు శతాబ్ధాలుగా దీపావళి పండగకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్‌పూర్ జిల్లాలోని సమ్మూ గ్రామం ఎన్నో వందల ఏళ్లుగా పండగను జరుపుకోవడం లేదు. దీనంతటికి ఓ ‘‘సతి’’ శాపమే కారణం. ఒక మహిళన తన భర్త చితిలో దూకి నిప్పటించుకుని మరణిస్తూ, శపించినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రజలు దీపావళిని జరుపుకోవడం లేదు. జిల్లా ప్రధాన కార్యాలయం నుంచి 25 కి.మీ దూరంలో ఉన్న సమ్మూలోని చిన్నగా దీపాలను వెలిగించవచ్చు, కానీ పటాకులు కాల్చడం, పండగ చేసుకోవడంపై నిషేధం ఉంది.
హంగేరీకి రష్యా అధ్యక్షుడు .. పుతిన్ అరెస్టుపై అనుమానాలు?
ప్రస్తుతం ప్రపంచం చూపు రష్యా-అమెరికాల పై ఉంది. మాస్కో-కీవ్ యుద్ధం ముగింపు కోసం అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్- రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరిగి, విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ వివాదానికి ముగింపు పలికే విషయం గురించి చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హంగేరీని తమ తదుపరి సమావేశం కోసం ఎంచుకున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.. హంగేరీలో పుతిన్ అరెస్ట్ చేయవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
బండ్ల గణేష్ ఇంట దీపావళి పార్టీ.. చీఫ్ గెస్ట్ చిరు?
టాలీవుడ్‌లో దీపావళి అనగానే గుర్తొచ్చే అతికొద్ది మంది పేర్లలో బండ్ల గణేష్ పేరు కూడా ఒకటి. ప్రతిదీ దీపావళికి ఒక లారీ లోడు టపాసులతో కలిసి కూర్చొని ఫోటోలు దిగి, ఆయన దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా, టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ ఆయన ఒక పార్టీ ఇస్తున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్, బండ్ల గణేష్ నివాసంలో ఈరోజు రాత్రి ఈ వేడుక జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న ఈ కార్యక్రమానికి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్‌ని కూడా ఆహ్వానించారని, వీలైతే ఆయన కూడా వస్తారనే ప్రచారం ఉంది. కేవలం సినీ ప్రముఖుల వరకే పరిమితం కాకుండా, బండ్ల గణేష్ రాజకీయ ప్రముఖులను సైతం ఆహ్వానించాలని తెలుస్తోంది. మరి ఈరోజు రాత్రి జరగబోతున్న పార్టీకి ఎవరెవరు హాజరు కాబోతున్నారని, మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
ఈరోజు ఒక్కరోజే 31 మంది నామినేషన్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం. భారత రాష్ట్ర సమితి (BRS) తరఫున పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన అభ్యర్థి తరపున నామినేషన్ వేసిన ఆయన, పార్టీ తరఫున అవసరమైన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. మరోవైపు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు.
మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నాడని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. కొల్లు రవీంద్ర స్వార్ధం కోసం జనంతో ఆటలాడుతున్నారు.. 13వ తేదీన మున్సిపల్ అధికారులతో ఒక నోటీస్ ఇప్పించారు.. జూలైలోనే మున్సిపల్ అధికారులతో కొల్లు రవీంద్ర ఓ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు.. బెల్లపుకోట్ల సందును నేను మొదటి సారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విస్తరణ చేశా.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు విస్తరణ చేయాలనే ఆలోచన రాలేదు.. రోడ్డు విస్తరణపై పేపర్లో వచ్చే వరకూ ఎవరికీ తెలియదు.. హడావిడిగా పేపర్ ప్రకటనపై మచిలీపట్నం ప్రజల్లో ఆందోళన మొదలైంది.. రూ. 10 కోట్లతో మిల్లు, 20 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, 5 కోట్లతో గెస్ట్ హౌస్ కడుతున్నాడు.. కొల్లు రవీంద్ర చేపట్టే ఒక్క నిర్మాణానికీ ప్లాన్లు లేవు.. చిన్న చిన్న వారిపై ప్రతాపం చూపించే మున్సిపల్ కమిషనర్ కు కొల్లు రవీంద్ర నిర్మాణాలు కనిపించలేదా అని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు.
ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడ్డ కార్గో టెర్మినల్
బంగ్లాదేశ్‌లోని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎయిర్ పోర్టులో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో అధికారులు విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలను నిలిపివేశారు. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులను నిల్వ చేసే విమానాశ్రయంలోని కార్గో టెర్మినల్ లో మంటలు చెలరేగాయి. బంగ్లాదేశ్ మీడియా నివేదికల ప్రకారం, విమానాశ్రయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మహ్మద్ మసుదుల్ హసన్ మసుద్ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకారం, బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, అగ్నిమాపక సేవ, బంగ్లాదేశ్ వైమానిక దళ అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.
మద్యం షాపుల కోసం మహిళల పోటీ.. ఒకే మహిళ 150 షాపులకు దరఖాస్తు..
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈరోజు మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆదాయం చేరింది.
ఏపీకి మరో అల్పపీడనం.. రేపు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 48 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన చెప్పుకొచ్చారు. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఇక, అక్టోబర్ 19న తేదీన శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక, ఈరోజు (అక్టోబర్ 18న) సాయంత్రం 5 గంటలకు విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో 49.7 మిల్లి మీటర్ల, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7మిల్లి మీటర్ల, తిరుపతి జిల్లా 27.7మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.
ఇది ఉద్యోగ నియామక పత్రం కాదు.. నిరుద్యోగుల కన్నీళ్లు తుడిచే పత్రం
హైదరాబాద్ శిల్పకళావేదికలో గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యసభలో బలం లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. “తెలంగాణ వచ్చాక పదేళ్లు ఒక కుటుంబం కోసమే పరిపాలన సాగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యం యువతకు ఉద్యోగాలు కల్పించడంపై దృష్టి పెట్టింది” అని అన్నారు.
భవిష్యత్తు అంతా యువతదే.. గూగుల్ రావడమే ఏపీ ప్రజలకు పెద్ద దీపావళి..
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. వైఎస్ జగన్ కుట్రలను ప్రభుత్వంతో పాటు పార్టీ నేతలూ తిప్పికొట్టాలి.. మంత్రులు మాట్లాడారు కదా మాకెందుకులే అని నేతలు అనుకోవద్దు.. కూటమి ప్రభుత్వంపై జగన్ విష ప్రచారాన్ని అందరూ అడ్డుకోవాలి.. జగన్ అసత్య ప్రచారాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ముఖ్యమంత్రి.. మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కాలేదన్న పార్టీ సీనియర్ నేతలు.. సిట్ విచారణ కొనసాగుతుంది.. చట్టం తన పని తాను చేస్తుందన్నారు సీఎం.. ఇక, విశాఖకు గూగుల్ రావడంపై ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు అభినందించారు.