హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్న కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించనున్నారు. సోమవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసం నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం 11 గంటలకు కన్హా శాంతివనం చేరుకోనున్నారు. ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి.పటేల్ దాజీ తో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. రెండు గంటల పాటు శాంతివనంలోని వెల్ నెస్ , మెడిటేషన్ సెంటర్ సహా, యోగా కేంద్రాలను ముఖ్యమంత్రి తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ సెంటర్, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్ నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ ను సీఎం సందర్శిస్తారు. అనంతరం శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి వెళ్లనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొత్తం 1400 ఎకరాల్లో కన్హా శాంతి వనాన్ని శ్రీరామచంద్ర మిషన్ అభివృద్ధి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ను ఈ ఆశ్రమం కలిగి ఉంది. 8 లక్షలకు పైగా వివిధ జాతుల వృక్షాలతో బయోడైవర్సిటీ కేంద్రంగా ఈ ఆశ్రమం పెద్దఎత్తున పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. మానవ వనరుల్ని గ్లోబల్ లీడర్లుగా తయారు చేసేందుకు ఈ ఆశ్రమం అధ్యక్షులు దాజీ నేతృత్వంలో హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్ ఈ ఆశ్రమం నిర్వహిస్తోంది.
మరీ ఇలా ఉన్నాడు ఏంటి.. బంగారం ఆశ చూపి భార్యను కడతేర్చాడు
అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకొని, ఏడు అడుగులు కలిసి నడిచిన సహధర్మచారిణి కడతేర్చాడు ఒక భర్త. బంగారం ఆశ చూపి భార్యను ఊరవతలకి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి, మృతదేహాన్ని బైక్ మీద తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు ఆ భర్త. ఈ ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరులో వెలుగుచూసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన మహాలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం మాచవరం వెళ్లిన వెంకటేశ్వర్లు బంగారం ఆశ చూపి భార్యను నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, అధికారుల ముందు లొంగిపోయాడు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే మహాలక్ష్మిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ- ఈసీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆయన బీజేపీతో పాటు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును హరించాలనే ప్రయత్నాలు గతంలో జరిగినట్టు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితరుల పోరాటాల వల్లే దేశంలోని ప్రతి పౌరుడికి ఓటు హక్కు దక్కిందని చెప్పారు.
వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. “సహానా.. సహానా” అంటూ రెచ్చిపోయాడుగా..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ “ది రాజా సాబ్” (The Raja Saab). ఈ రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రద్దీ కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ తాజాగా “సహానా.. సహానా” (Sahana Sahana Song Promo) అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ మెలోడీ సాంగ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్, నిధి అగర్వాల్ జంటగా ఉన్న ఈ ప్రోమోలో.. ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ “సహానా.. సహానా” అంటూ ఉంటే సినిమాలో వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్.. కచ్చితంగానేలా కనపడుతుంది. ఇప్పటికే విడుదలైన ‘రెబల్ సాబ్’ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ “సహానా.. సహానా” పూర్తి వీడియో సాంగ్ డిసెంబర్ 17న సాయంత్రం 6.35 గంటలకు విడుదల కానుంది. ఇక ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకెందుకు ఆలస్యం సాంగ్ ప్రోమో ఇక్కడ చూసేయండి.
రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఈ విడతలో మొత్తం 85.76% పోలింగ్ నమోదైంది. జిల్లా వారీగా చూస్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92% పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ జిల్లాలో అత్యల్పంగా 76% నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 3,911 గ్రామ పంచాయతీలకు మరియు 29,000 పైచిలుకు వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ సజావుగా జరుగుతోంది. చిన్న గ్రామ పంచాయతీల్లో ఫలితాలు త్వరగా వస్తున్నప్పటికీ, పెద్ద పంచాయతీల్లో కొంత ఆలస్యం అవుతోంది. బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసిన తర్వాత, వాటిని వేరు చేసి, 25 బండిల్స్‌గా కట్టడం మరియు సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్లను విడదీయడం వంటి ప్రక్రియ కారణంగా ఈ ఆలస్యం జరుగుతోంది.
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్.. ఎవరు ఈయన..
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు. బీహార్ బీజేపీలో సీనియర్ నేతగా నితిన్ నబిన్ ఉన్నారు. పాట్నాలో జన్మించిన ఈయన సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. తండ్రి మరణాంతరం నితిన్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. పాట్నాలోని బాంకిపూర్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006 ఉప ఎన్నికలో విజయం సాధించినప్పటి నుండి, నవీన్ 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో బాంకిపూర్ నుంచి 51,000 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు.
క్యూట్ క్రికెటర్‌తో తిలక్ వర్మ డేటింగ్..!
టీమిండియా బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ఆటగాడు ఓటమికి ఎదురు నిలిచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా తిలక్ వర్మ ఒక కొత్త రూమర్‌తో వార్తల్లో నిలిచాడు. ఈ టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ నేపాలీ క్యూట్ క్రికెటర్‌తో డేటింగ్ చేస్తున్నాడంటా. ఈ పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నేపాలీ క్యూట్ క్రికెర్ ఎవరో తెలుసా.. ఇందు బర్మా. తిలక్ వర్మ – ఇందు బర్మా మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ సోషల్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ పుకార్లపై ఇరువైపుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
మోడీ ఆత్మవిశ్వాసం దెబ్బతింది, బీజేపీ ఓటమి తప్పదు.. ‘‘ఓట్ చోరీ’’ ర్యాలీలో రాహుల్ గాంధీ
బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘‘ఓట్ చోరీ’’కి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ రోజు(ఆదివారం) ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అండమాన్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సత్యమేవ జయతే అనే నినాదాన్ని మనం అందరి విన్నామని, కానీ సత్యం అనేది లేకుండా అధికారమే ముఖ్యమని మోహన్ భగవత్ అంటున్నారని విమర్శించారు. సత్యం, అసత్యం మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన అన్నారు.
మరోసారి నో షేక్‌హ్యాండ్స్.. చర్చనీయాంశమైన ఇండియా–పాక్ మ్యాచ్
దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో డిసెంబర్ 14 (ఆదివారం) జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు పాకిస్థాన్ అండర్-19 జట్టుతో కరచాలనం చేసే సంప్రదాయాన్ని పాటించలేదు. అయితే ఐసీసీ రెండు జట్లను ప్రీ-మ్యాచ్ ప్రోటోకాల్స్‌ను పాటించాలని కోరినప్పటికీ, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే – పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసుఫ్ షేక్‌హ్యాండ్స్ ఇచ్చుకోలేదు. పలు నివేదికల ప్రకారం.. ఐసీసీ టోర్నమెంట్‌ను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంది, అలాగే ఆటగాళ్లు ఆట స్ఫూర్తిలో ఉన్న మర్యాదలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఆటగాళ్లకు ఇంకా నిర్దిష్ట సూచనలు ఏవీ జారీ కాలేదని, అయితే బోర్డు తన వైఖరిని జట్టు మేనేజర్ ఆనంద్ దాతర్‌కు తెలియజేస్తుందని సమాచారం. ఈ టోర్నీలో టీమిండియా – పాకిస్థాన్ జట్లు వారివారి జర్నీలను విజయాలతో ప్రారంభించాయి. భారతదేశం UAEని ఓడించగా, పాకిస్థాన్ మలేషియాపై గెలిచింది. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ముందుగా బ్యాటింగ్‌కు దిగి 270 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
దారుణం.. పోలీసుపై కత్తితో దాడి చేసిన మతిస్థిమితం లేని యువకుడు..!
అనంతపురం జిల్లా పామిడి పట్టణ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రవి అనే యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కత్తితో వీరంగం సృష్టించి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో రవి కత్తితో దాడి చేయడమే కాకుండా, పోలీసు జీప్‌పై కర్రలతో దాడి చేశాడు. దీంతో కొంతసేపు పామిడి పట్టణంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు.