రిలీజ్‌కు ముందే రూ.600 కోట్లు.. అల్లు అర్జున్–అట్లీ రేంజ్ ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్ట్ (AA22 x A6) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న మరియు జాన్వీ కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నారని సమాచారం. హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లతో, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) హంగులతో అట్లీ ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. 2027 వేసవిలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ డీల్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది.
సభలో నుంచి కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారో ఆయన్నే అడగండి..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి కరచాలనం చేశారు. ఇక, సమావేశాలు ప్రారంభమైన కొద్దీసేటికే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోయారు. కాగా, మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నేను కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడ అడగండి.. అక్కడ అడగాల్సిన విషయాలు ఇక్కడ అడగడం ఎందుకు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను కలవడం ఇది రెండో సారి.. మొదటి సారి కాదని సూచించారు. హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా కలిశాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
45 రోజులుగా నిద్రలేని రాత్రులు.. ఎన్నో అనుభవించాం.. స్మృతి సంచలన కామెంట్స్..!
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో 10,000 అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసిన మిథాలీ రాజ్ గత తర్వాత ఆమె ఎదురుకున్న అనేక సందర్బాలను చెప్పుకొచ్చింది. ముఖ్యంగా 2025 నవంబర్ 2న భారత్ తన మొట్టమొదటి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న చారిత్రాత్మక సందర్భానికి గుర్తుచేసుకుంటూ.. ఆమె తన మనసులోని భావాలను పంచుకుంది. మహిళా ప్రపంచకప్ 2025 విజయం నాకు ఇంకా నమ్మశక్యంగా లేదు (Still sinking in). నేను సాధారణంగా క్రికెట్ మైదానంలో అంతగా భావోద్వేగానికి లోనుకాను. కానీ, ఇది చాలా అద్భుతమైన క్షణం. స్వదేశంలో ప్రపంచకప్ ఆడటం, భారత్‌లోనే ప్రపంచ ఛాంపియన్‌లుగా నిలవడం అనేది నా మనసు ఇంకా పూర్తిగా జీర్ణించుకోలేకపోతోందని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఆరావళి మైనింగ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్రానికి.. రాష్ట్రాలకు నోటీసులు
ఆరావళి పర్వత శ్రేణులపై గతంలో ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సవరించింది. మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించకూడదని గతంలో ఇచ్చిన తీర్పుపై తాజాగా న్యాయస్థానం స్టే విధించింది. నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా నిలిపివేసింది. మునుపటి కమిటీలో నిపుణుల కాకుండా.. అధికారులే ఎక్కువగా ఉన్నారని అభిప్రాయపడింది. తదుపరి విచారణ జనవరి 21కు వాయిదా వేసింది. ఆరావళి పర్వత శ్రేణుల విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఆరావళి పర్వతాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. మునుపటి నివేదికను పునఃపరిశీలించడానికి సంబంధిత రంగంలో నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కమిటీ ఏర్పాటుకు ముందు కమిటీ దర్యాప్తు చేసే ప్రాంతాలను నిర్ణయించాలని సొలిసిటరీ జనరల్ కోరారు. నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో అమికస్ క్యూరీ, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు సహాయం చేయనున్నారు. ఇకపై మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించవద్దని రాష్ట్రాలకు ఇప్పటికే నోటీసు జారీ చేసినట్లు సొలిసిటరీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే… ఈ ఏడాది క్రైమ్ రేట్ బాగా తగ్గింది-డీజీపీ
రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే 2025లో నేరాల రేటు గణనీయంగా తగ్గిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, పోలీసింగ్‌లో సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. హిడ్మా ఎన్‌కౌంటర్ ఘటనను పోలీస్ శాఖ విజయం లేదా మావోయిస్టుల ఓటమిగా చూడలేమని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రజలకు చెబుతున్నాం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చర్యలు తీసుకోవడమే మా బాధ్యత అని స్పష్టం చేశారు.
ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం
ఇండోనేషియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఒక వృద్ధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది సజీవదహనం అయ్యారు. ఉత్తర సులవేసి ప్రావిన్షియల్ రాజధాని మనాడోలోని నర్సింగ్ హోమ్‌లో ఆదివారం రాత్రి 8:31 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. తిప్పించుకునే మార్గం లేక అగ్నికీ ఆహుతియ్యారు. 16 మంది సజీవదహనం కాగా.. ముగ్గురికి గాయాలైనట్లు రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ జిమ్మీ తెలిపారు. గదుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయని చెప్పారు. సాయంత్రం వేళల్లో మంటలు చెలరేగిన సమయంలో చాలా మంది వృద్ధులు తమ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు. 12 మందిని కాపాడినట్లు చెప్పారు. ప్రమాద దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారం అయ్యాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియ లేదు.
కేబినెట్ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో అనూహ్యంగా భావోద్వేగ పరిస్థితి నెలకొంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై జరిగిన చర్చలో… రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లి కేంద్రంగా మార్చే అవకాశం ఉందన్న ప్రతిపాదన తెరపైకి రావడంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురై, సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి ఆవేదనను గమనించిన సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఆయనను ఓదార్చినట్టు కేబినెట్ వర్గాలు తెలిపాయి. రాయచోటిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని మంత్రి గట్టిగా కోరినట్టు సమాచారం. మరోవైపు, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడేందుకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిరాకరించారు. సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన.. రాయచోటిపై ప్రశ్నలు ఎదురుకాగానే మరింత ఉద్వేగానికి లోనై, కన్నీళ్లతోనే కారులో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా కేంద్రంపై జరుగుతున్న పరిణామాలపై ఆయన మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు కనిపించింది. రాయచోటి–మదనపల్లి మధ్య జిల్లా కేంద్రం అంశం ఇప్పటికే స్థానికంగా సున్నితమైన అంశంగా మారింది. తాజాగా మంత్రి కన్నీటి ఘటనతో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ప్రజల అభిప్రాయాలు, పాలన సౌలభ్యం, భౌగోళిక సమీకరణ వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, స్థానిక నేతలు, ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మందు బాబులకు శుభవార్త.. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు!
2026 నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు, సేవల సమయాలను పొడిగించేందుకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనుమతి మంజూరు చేశారు. ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రత్యేక అనుమతుల ప్రకారం.. డిసెంబర్ 31 మరియు జనవరి 1 రాత్రుల్లో A4 మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు విక్రయించవచ్చు. అలాగే 2B బార్లు, C1 (ఇన్-హౌస్), EP1 (ఈవెంట్ పర్మిట్), TD1 (ఇన్-హౌస్) లైసెన్సులు కలిగిన ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంస్థలకు రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సర్వీస్‌కు అనుమతి ఇచ్చారు. గత ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా అమలు చేసిన విధానాన్నే ఈ ఏడాదీ కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం, అక్రమ మద్యం విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల అమలుకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.
అసెంబ్లీని 15 రోజులు జరపాల్సిందే.. బీఏసీ మీటింగ్‌లో హరీష్ రావు డిమాండ్..
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల నిర్వహణపై స్పష్టతనిచ్చేందుకు నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని, సభ నిర్వహణ తీరుపై పలు కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. బీఏసీ సమావేశం అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, అందుకే అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నిర్వహించాలని తాము డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేవలం వారం రోజుల్లో ప్రజా సమస్యలన్నింటిపై చర్చించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కేవలం మూడు లేదా నాలుగు రోజులతో సభను ముగించే ప్రయత్నం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు.