అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి
రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అడవిలో ఓ వ్యక్తి కారు ఆపి బయటకు దిగాడు.. తన గర్ల్ ఫ్రెండ్ వీడియో తీస్తుండగా.. ఓ భయానక సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఫోటోలు దిగుతున్న సమయంలో ఓ పులి ఆ యువకుడిపై ఒక్కసారిగా దాడి చేసి.. అతడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లకు అక్కడ ఏం జరుగుతుందో కొద్ది సేపటికి వరకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. కారులో అమ్మాయి మాత్రం భయపడుతూ కేకలు వేసింది.
పిఠాపురంలో పార్టీ ప్రక్షాళనపై పవన్ కల్యాణ్ ఫోకస్.. ఫైవ్ మెన్ కమిటీ నుంచి మర్రెడ్డి తొలగింపు..
ఓవైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. మరో వైపు పార్టీని పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో బలోపేతం, శ్రమించిన వారికి గుర్తింపు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలించిన అనంతరం పిఠాపురంలో పార్టీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. అయితే, గతంలో పిఠాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్‌గా పనిచేసిన మర్రెడ్డి శ్రీనివాస్‌ను రెండు నెలల క్రితం ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం ఐదుగురు సభ్యులతో ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, తుమ్మల బాబు, మర్రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
బీహార్ ఫలితాలపై ఏఐసీసీ అధిష్ఠానం “ఆత్మశోధన”.. మీడియాకు మొహం చాటేసిన రాహుల్‌గాంధీ..
బీహార్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా “ఏఐసిసి” అధిష్ఠానం ఆత్మశోధన నిమిత్తం సమావేశం నిర్వహించింది. “ఏఐసిసి” అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో అగ్ర నేత రాహుల్ గాంధీ తోపాటు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ అంశంపై గంటకు పైగా సమాలోచనలు కొనసాగాయి.. సమావేశంలో వాడి వేడిగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి, ప్రధాని మోడీ చేసిన తీవ్ర విమర్శలు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఆత్మశోధనలో మునిగిపోయింది. ఊహించని ఫలితాలతో తీవ్ర నిరాశకు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నేతలు.. భేటీ అనంతరం.. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడకుండా “మౌనంగా” వెళ్ళి పోయారు. “రాష్ట్రీయ జనతా దళ్” (ఆర్.జే.డి) నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్‌లతో రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడారు. అలాగే, “మహాఘఠ్ బంధన్” లోని ఇతర సహచర భాగస్వామ్యపక్షాల నేతలతో సైతం రాహుల్ ముచ్చటించారు. అయితే.. ఈ భేటీపై కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, అజయ్ మెకన్ మీడియా సమావేశంలో ప్రసంగించారు. “కేంద్ర ఎన్నికల సంఘం” చేపట్టిన “ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన, పునఃపరిశీలన” కార్యక్రమం (సర్)తో పాటు, పలు విధాలుగా “ఓట్ చోరీ” (ఓట్ల దొంగతనం) జరిగిందని విమర్శించారు.. 15 రోజుల్లో పూర్తి సమాచారం సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A-49 ఆర్థిక నేరస్తుడు అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనిల్ చోఖరా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి మద్యం ముడుపుల డబ్బును బదిలీ చేశారు. తర్వాత సిండికేట్ సభ్యులకు చేరవేశాడు.. రాజ్ కేసిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వసూలు చేసిన 77.55 కోట్ల రూపాయలను ముంబైలో నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేశాడు.. అదానీ డిస్టలరీస్ నుంచి రూ. 18 కోట్లు, లీలా డిస్ట్రలరీస్ నుంచి రూ. 20, స్పై ఆగ్రో రూ. 39 మొత్తం 77 కోట్ల రూపాయలను నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ అయ్యాయి. అక్కడ నుంచి మరో 32 షెల్ కంపెనీలకు డబ్బును మళ్లించారు.. షెల్ కంపెనీల్లో అక్రమ లావాదేవీలు గుర్తించడానికి ముంబైలో పలుమార్లు దర్యాప్తు చేపట్టారు.. 10-03-2025 నుంచి 10-11-2025 వరకు జరిపిన విచారణలో 25 షెల్ కంపెనీలు అడ్రస్సులతో సహా గుర్తించారు.
దర్శనానికి పాకిస్తాన్ వెళ్లింది, మతం మారి పెళ్లి చేసుకుంది..
పాకిస్తాన్‌కు వెళ్లి తప్పిపోయిన మహిళ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురునానక్ దేవ్ ప్రకాష్ పర్వ్ సందర్భంగా పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కనిపించకుండాపోయిన సిక్కు మహిళ సరబ్జీత్ కౌర్(52) ఇస్లాం మతంలోకి మారి పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు తేలింది. పంజాబ్ లోని కపుర్తాలకు చెందిన సరబ్జిత్, ఇతర సిక్కు యాత్రికులతో కలిసి గురునానక్ దేవ్ 555వ జయంతి కోసం నవంబర్ 4న లాహోర్ సమీపంలో ఉన్న నాంకానా సాహిబ్ క్షేత్రానికి వెళ్లింది. అయితే, నవంబర్ 13న 1900 మందికి పైగా యాత్రికులు తిరిగి భారత్ కు వచ్చారు. ఇందులో సరబ్జిత్ కౌర్ లేదు.
‘‘ఓటమికి కుంగిపోము, గెలుపుకు పొంగిపోము’’.. ఆర్జేడీ తొలి స్పందన..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిని తుడిచిపెట్టేసింది. మరోసారి, జేడీయూ-బీజేపీ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో ఎన్డీయే కూటమి ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 89, జేడీయూ 85, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ 19లతో పాటు మిగిలిన స్థానాలను ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు గెలుచుకున్నాయి. మరోవైపు, తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కేవలం 25 సీట్లను మాత్రమే గెలుచుకుని దారుణ ఓటమిని చవిచూసింది.
ఆడబిడ్డల వైపు చూడాలంటేనే భయపడాలి..
తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి బలోపేతానికి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా సమాఖ్యల సమావేశంలో ఆమె కీలక ప్రసంగం చేశారు. మహిళా శక్తి, మహిళా సంఘాల భవిష్యత్ దిశ, వారి సామాజిక పాత్రపై పలు కీలక అంశాలను వివరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర అభివృద్ధి మహిళల శక్తి మీదే ఆధారపడి ఉందన్నారు. కింది స్థాయి మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకుని ముందుకు సాగేందుకు మహిళా సమాఖ్యలు మార్గనిర్దేశం చేయాలని కోరారు. లోన్లు పొందడంలో, చిన్న వ్యాపారాలు ప్రారంభించడంలో, ఆర్థికంగా స్థిరపడడంలో సమాఖ్యలు మహిళలకు తోడ్పడాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, కుటుంబాల అభ్యున్నతిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
బీహార్ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన ఆర్జేడీ.. అయినా ఎందుకు ఘోర పరాజయం.?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ-జేడీయూ-ఎల్జేపీల కూటమి 243 సీట్లలో ఏకంగా 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ నేతృత్వంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టుల కూటమి ‘‘మహా ఘట్బంధన్’’ కేవలం 35 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఆర్జేడీ 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ తన చరిత్రలో రెండో చెత్త ప్రదర్శన చేసింది. అంతకుముందు, 2010లో కేవలం 22 సీట్లు వచ్చాయి. అయితే, ఓ విషయంలో మాత్రం ఆర్జేడీ ఇతర పార్టీలకు అందకుండా నిలిచింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం, బీహార్ ఎన్నికల్లో 143 సీట్లలో పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకున్న ఆర్జేడీ పార్టీ 23 శాతం ఓట్లను సంపాదించింది. 2020 ఎన్నికలతో పోలిస్తే 23.11 ఓట్ల శాతం నుంచి స్వల్పంగా తగ్గింది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూల కన్నా అత్యధిక ఓట్లను సంపాదించింది.
కుల గణన చేయడంలో స్టాలిన్ ఫెయిల్.. హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్న టీవీకే!
నా స్నేహితుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడు పెళ్లి కోసం వచ్చాను అని పట్టాలి మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.5 శాతం వన్నీయర్ అగ్నికుల క్షత్రియ కులస్తులు ఉన్నారు.. వన్నీయర్ కులం నుంచి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలని నా స్నేహితుడు మంత్రి నారా లోకేష్ ను కోరాను.. అగ్నికుల వన్నీయర్ లో కులానికి ప్రత్యేక కేటగిరి ఇవ్వాలని కోరుతున్నాం.. కుల గణన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నాను.. గత ముఖ్యమంత్రి 80 శాతం పూర్తి చేశాడు.. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుంది అన్నారు. కాగా, మిగతా రాష్ట్రాల్లో కుల గణన ఇప్పటికే పూర్తి చేశారు.. కులాల వారీగా కుల గణన జరగాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఏపీ సీఎంను కలుస్తానని పట్టాలి మక్కల్ కట్చి చీఫ్ అన్బుమణి పేర్కొన్నారు.
బెట్టింగ్ యాప్స్ కేసులో ముగిసిన హీరో రానా విచారణ..
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్‌కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా దగ్గుబాటి హీరో రానా విచారణకు హాజరుకావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఐడీ పోలీసుల ముందుకు హీరో రానా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సీఐడీ అధికారులు హీరో రానాను గంటన్నర పాటు ప్రశ్నించారు. ఈ విచారణకు రానా తన బ్యాంక్ స్టేట్‌మెంట్లతో హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్‌తో రానా చేసుకున్న అగ్రిమెంట్‌పై సీఐడీ విచారించింది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌తో రానాకు వచ్చిన పారితోషికంపై కూడా సీఐడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా హీరో రానా మాట్లాడుతూ.. తాను స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, ఇప్పటికే ఈ కేసులో సీఐడీకి కూడా స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. రానా 2017లో బెట్టింగ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు. తాను ఈ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేయడానికి ముందు తన లీగల టీమ్‌తో అన్నీ పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు గతంలో చెప్పిన రానా వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతో తాను ఒప్పందం చేసుకోలేదన్న రానా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం యాంకర్ విష్ణుప్రియను కూడా సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా ప్రకాష్‌రాజ్, హీరో విజయ్ దేవరకొండ, సిరిహనుమంతు సీఐడీ విచారణకు హాజరయ్యారు.