Top Headlines @5PM : టాప్ న్యూస్
- గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రియాక్షన్..
- అలా చేస్తే భార్యకు "భరణం" చెల్లించాల్సిన అవసరం లేదు..
- గెట్ రెడీ.. 'ఉస్తాద్' సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
- ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుడ్‌న్యూస్ చెప్పిన సర్కార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు..
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు లక్ష్యంగా పనిచేస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అమలు చేయనుంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్ మార్గం కల్పించేందుకు మూడంచెల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
వైసీపీపై విరుచుకుపడ్డ పవన్ కల్యాణ్.. అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపారు..
ఏపీ పాలిటిక్స్‌లో తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం కాకరేపుతోంది.. సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబుతో కూటమి నేతల కీలక భేటీ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అయోధ్యకు కూడా కల్తీ లడ్డూలు పంపిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన తప్పు కాదని, కావాలనే, తెలిసే చేసిన చర్యలేనని అన్నారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ.. ఎవరిని వదిలేది లేదు..!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. తన నివాసంలో కూటమి ప్రభుత్వంలోని నేతలతో సమావేశం నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లడ్డూ వ్యవహారంపై సీబీఐ కూడా చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చిందని పేర్కొన్న చంద్రబాబు, గత పాలకులు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తప్పులు చేసి మళ్లీ తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గమైన రాజకీయమని అన్నారు.
గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రియాక్షన్..
గ్రూప్ -1 నియామకాల అంశంలో హైకోర్టు తీర్పుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఎందరు, ఎన్ని కుట్రలు పన్ని.. ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా.. వారి కుట్రలు, కుతంత్రాలను ఛేదించి న్యాయ పోరాటంలో విజయం సాధించామని తెలిపారు. న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో 563 మంది గ్రూప్ -1 అభ్యర్థులకు అభినందనలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్ -1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్ నిర్మాణానికి పునరంకితం కావాలని పిలుపునిస్తున్నానని పేర్కొన్నారు.
“థాంక్యూ పాకిస్థాన్”.. పాక్ నిర్ణయంపై బంగ్లాదేశ్ రియాక్షన్..
మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే పాల్గొనే జట్లు ప్రాక్టీస్ లో మునిగిపోయాయి. టీమిండియా సైతం ఎలాగైనా టైటిల్ సాధించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు.. పాకిస్థాన్ టీం నాటకీయ పరిస్థితి ముదురుతోంది. ఈ నేపథ్యంలో తమకు సపోర్టుగా నిలిచిన పాకిస్థాన్ నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది. బంగ్లాదేశ్ యువజన, క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించిన నిర్ణయానికి నిరసనగా భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించడాన్ని పాకిస్థాన్ ప్రకటించడం ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం ఫేస్బుక్లో పోస్టు చేసిన ఆసిఫ్ నజ్రుల్.. “థాంక్యూ పాకిస్థాన్” అని రాసుకొచ్చారు. షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.
ప్రధాని మోడీపై దాడికి కాంగ్రెస్ భారీ కుట్ర.?
ప్రధాని నరేంద్రమోడీపై సభలో భౌతిక దాడికి దిగాలని కాంగ్రెస్ కుట్ర పన్నినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మోడీపై శారీరక దాడికి ప్లాన్ చేసిందనే హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ఆయన స్పీచ్ రద్దు చేయబడినట్లు తెలిపారు. అయితే ఈ వాదనల్లో నిజం లేదని కాంగ్రెస్ చెబుతోంది. మహిళా ఎంపీలు ఒక ప్రధానిపై దాడికి ఎలా కుట్ర పన్నుతారని ప్రశ్నించారు. నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ లోక్‌సపభలో మాట్లాడాల్సి ఉంది. అయితే, ప్రధాని సభకు రాకముందే కాంగ్రెస్ ఎంపీలు నిరసన కొనసాగించారు. ప్రతిపక్షాలకు చెందిన 8-9 మంది మహిళా ఎంపీలు ‘‘ Do what is right’’ అనే ప్లకార్డులు పట్టుకుని లోక్‌సభలో ప్రధాని మోడీ కుర్చీని ముట్టడించారు. కొంత మంది మంత్రులు వారిని వెళ్లిపోవాలని కోరిన తర్వాత మహిళా ఎంపీలు తమ ముట్టడిని విమరించుకున్నారు. చివరకు లోక్‌సభ వాయిదా పడింది. ప్రధాని ప్రసంగం రద్దు చేశారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగాన్ని వాయిదా వేయడం అనూహ్య నిర్ణయమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రధాని భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి?
సిట్ రిపోర్టులో ఉన్నదేంటి? మీరు ప్రచారం చేస్తుందేంటి అని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. సిట్ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు కలిసిందనేది సస్పెక్ట్ అని రాస్తే.. జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు ఎలా చెప్తారు? అని ప్రశ్నించారు. CFTRIకి శాంపిల్స్ పంపాలన్నదే తాను అని స్పష్టం చేశారు. ఎవరో పంపిన ఫిర్యాదు మీద CFTRIకి పంపింది తానే అని వెల్లడించారు. నెయ్యి సరఫరా సరిపడా లేకనే టెండర్ నిబంధనలు సడలించామని చెప్పారు. తాజాగా వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
గెట్ రెడీ.. ‘ఉస్తాద్’ సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!
‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పవర్ ప్యాక్డ్ పోలీస్ డ్రామా ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్ ‘దేఖ్ లేంగే సాలా’ ఫ్యాన్స్‌ను మంచి కిక్ ఇవ్వగా.. ఇప్పుడు చిత్ర యూనిట్ రెండో పాట రిలీజ్‌కు రెడీ అవుతోంది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15న ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో పవన్-హరీష్-డీఎస్పీ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఆల్బమ్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ కూడా అదే స్థాయిలో మెగా మాస్ బీట్స్‌తో ఉంటుందని సమాచారం. రెండో పాటలో పవన్ కళ్యాణ్ తనదైన స్టైలిష్ స్టెప్పులతో రచ్చ చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో ఆ పాట కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
అలా చేస్తే భార్యకు “భరణం” చెల్లించాల్సిన అవసరం లేదు..
ఇటీవల విడాకులు తీసుకుంటూ, ఇష్టారీతిన భరణం కోరుతున్న మహిళలకు షాక్ ఇచ్చేలా ఛత్తీస్‌గఢ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ‘‘సహేతుకమైన కారణం లేకుండా తన భర్త నుంచి విడిగా జీవించాలని భావించే భార్య భరణానికి అర్హురాలు కాదు’’ అని కోర్టు చెప్పింది. భరణం పొందే హక్కును నిర్ణయించడానికి వైవాహిక స్థితి కేవలం ఆధారం కాదని, ప్రవర్తనపై కూడా ప్రాధాన్యత ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో వివాహం తర్వాత నాలుగు రోజులకే ఒక మహిళ తన భర్త, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక శారీరక వేధింపుల ఆరోపణలు చేసింది. అత్తమామలు రూ. 10 లక్షలు, కారు డిమాండ్ చేసినట్లు ఆరోపించింది. దీని తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్టార్ 125 కింద భరణం కోరింది. భర్త కాపురానికి సిద్ధంగా ఉన్నాడని, బిలాస్పూర్ ఫ్యామిలీ కోర్టు ఆమె భరణం అభ్యర్థనను తిరస్కరించింది.
పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత్ సిద్ధం.. కొలంబో ఫ్లైట్ బుక్ అయింది!
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయంపై స్పందించిన సూర్య.. పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు టీమిండియాకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశాడు. ఐసీసీ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని, భారత్ ఎప్పుడూ పాక్‌తో ఆడేందుకు నిరాకరించలేదని వెల్లడించాడు. పాకిస్థాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. దీంతో ఐసీసీ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందన్న దానిపై ఆసక్తి పెరిగింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉండగా.. శ్రీలంకతో కలిసి భారత్ ఈ టోర్నీకి ఆతిథ్యం వహిస్తోంది. భారత్–పాక్ మ్యాచ్‌ను కొలంబోలో నిర్వహించాలని ఐసీసీ ముందుగానే నిర్ణయించింది. ముంబైలో మీడియాతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘మా మైండ్‌సెట్ చాలా క్లియర్. మేము పాక్‌తో ఆడేందుకు ఎప్పుడూ నిరాకరించలేదు. పాక్ వైపు నుంచి నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ ఫిక్చర్ ఇచ్చింది, ప్రభుత్వాలు న్యూట్రల్ వేదికను నిర్ణయించాయి. కొలంబోకి మా ఫ్లైట్ ఇప్పటికే బుక్ అయింది. మ్యాచ్ కోసం మేము వెళ్తాం కూడా. ఆ తర్వాత ఏమవుతుందో మా చేతుల్లో లేదు’ అని అన్నారు.
తాజావార్తలు
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!