CM Chandrababu: తిరుపతిలో ఇవాళ జరుగుతున్న జాతీయ మహిళా సాధికారిత సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, అమరావతి- తిరుపతి మార్గంలో దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో హెలికాప్టర్ ప్రయాణం సురక్షితం కాదని ఏవియేషన్ అధికారులు తెలిపారు. దీంతో సీఎం చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేదు.
Read Also: Hyderabad: వీడేం తండ్రి.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేసి.. మూసిలో పడేసిన వైనం
మరోవైపు, తిరుపతిలోని రాహుల్ కన్వెన్షన్ హాల్లో జరిగే మహిళా సాధికారతపై జాతీయ సదస్సులో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, బీజేపీ ఎంపీ పురందరేశ్వరి సహా పలు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి రెండ్రోజుల పాటు జరగనుంది.