హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రి కొడుకు పాలిట కాలయముడయ్యాడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకుని హత్య చేశాడు. అనంతరం బాలుడు మృతదేహాన్ని సంచిలో తీసుకెళ్లి నయా పుల్ బ్రిడ్జి పైనుంచి మూసిలో పడేశాడు. ఆ తర్వాత బాబు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు నిందితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా తండ్రిపై అనుమానం వ్యక్తం చేశారు.
Also Read:Diarrhea: విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు.. బాధితులకు అండగా వైసీపీ!
తండ్రి మహమ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తన కొడుకును చంపేశానని నిజం ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. బండ్లగూడ పోలీస్ లతో పాటు హైడ్రా ఎన్ డి ఆర్ ఎఫ్ అధికారుల మూసిలో బాలుడు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీస్ విచారణ లో తండ్రి చెప్పిన సమాచారం మేరకు మూసిలో జల్లెడ పడుతున్నారు పోలీసులు. కొడుకును చంపిన తండ్రిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడు తండ్రి కాదు యముడు అంటూ మండిపడుతున్నారు.