రైతులు పొలంలో అనేక రకాల పంటలు వేస్తుంటారు. వాణిజ్య పంటలయితే వాటికి భలే డిమాండ్ వుంటుంది. అయితే, జనం దిష్టితో పాటు ఆ పంటలకు దొంగల భయం కూడా వుంటుంది. పొలంలో సాగుచేస్తున్న పైరుకు ఇరుగు పొరుగు దిష్టి తగలకూడదని ఓ రైతు ఐడియా వేశాడు. అతను వేసిన ఐడియా వర్కవుట్ అయింది. తన పొలంలో పంటలు చూసి దిష్టి తగులుతుందని, బికినీ ధరించిన మోడల్స్ బ్యానర్లు పెట్టాడు. సాధారణంగా తోటలో దిష్టి కోసం మనుషుల ఫొటోలు ఏర్పాటు చేస్తుంటారు. కానీ ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు.
Trees Cutting : టెన్నిస్ కోర్టు కోసం వంద చెట్లు నాశనం… బల్దియా తుమ్ నే క్యాకియా?
గతంలో దిష్టి కోసం గుమ్మడి కాయలు, కన్ను దిష్టి యంత్రాలు పెట్టేవారు. మరికొందరు గట్టితో దిష్టిబొమ్మలు తయారుచేసేవారు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడంతా హైటెక్ కల్చర్. ఓరైతు బికినీ ధరించిన బ్యానర్ ఫోటోలు పెట్టాడు.. ఈ సంఘటన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పెద్దపాండూరులో జరిగింది. అటుగా వెళ్తున్న వాహనదారులు ఈ ఫోటోలను ఆసక్తిగా గమనిస్తున్నారు. తోటకు నరదిష్టి తగలకుండా ఉండేందుకు వీటిని పెట్టానని రైతు కిష్టయ్య తెలిపారు. రోడ్లమీద వెళ్ళేటప్పుడు అందమయిన హీరోయిన్ల ఫ్లెక్సీలు పెట్టడం మామూలే. కానీ ఈ పొలంలో వున్న ఫోటోలు చూసిన యువత ఈ బికినీలతో చంపేస్తున్నార్రా బాబూ.. పొలంలో వున్నాయి కాబట్టి సరిపోయింది…అదే రోడ్లమీద అయితే.. ప్రమాదాలు జరగకమానవు అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వాటెన్ ఐడియా కిష్టయ్య అనక తప్పడంలేదు కదూ…
బికినీతో కవ్విస్తున్న భామ