మొటిమలు, చర్మ సమస్యలు, జిడ్డు చర్మం ఉన్నవారు ముఖాన్ని తరచుగా కడుతుంటారు. ఇలా చేయడం సేఫేనా?
చర్మాన్ని తరచుగా క్లీన్సర్‌తో శుభ్రం చేసుకోవడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు.
తరచుగా ఫేస్ వాష్ లేదా క్లీన్సర్ ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతినడంతో పాటు మొటిమల సమస్య ఎక్కువవుతుంది.
ముఖాన్ని పదేపదే కడుక్కోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి.
కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించడానికి కూడా ఇదే కారణం అంటున్నారు నిపుణులు.
తరచుగా ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.
చర్మం తన సహజ ప్రకాశాన్ని కూడా కోల్పోతుంది.
చర్మంపై మొటిమలు లేదా దద్దుర్లు ఉన్నట్లయితే మీరు మీ ముఖాన్ని రోజుకు 2-3 సార్ల కంటే ఎక్కువసార్లు కడగకండి.