Tirumala: దేశవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా కొన్ని ప్రదేశాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే ఆలయాల జాబితాను ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల రెండో స్థానంలో ఉంది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తిరుమల శ్రీవారిని తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈ ఏడాది ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది.
దేశ వ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఓయో కల్చరల్ రిపోర్టు తన నివేదికను విడుదల చేసింది. మరోవైపు దర్శనీయ ప్రదేశాల్లో గదుల బుకింగ్ జరుగుతున్న తీరుపైనా సర్వే రిపోర్టును వెల్లడించింది. ఈ మేరకు తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఈ జాబితాలో తిరుమల తర్వాతి స్థానాల్లో వారణాసి, షిరిడీ ఉన్నాయి.
Read Also: Rohingya Refugees: నెల రోజులు నడి సముద్రంలోనే.. చివరికి గాలులతో..
కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6 పనుంచి 10 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.