Tirumala: దేశవ్యాప్తంగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నా కొన్ని ప్రదేశాలకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించుకునే ఆలయాల జాబితాను ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాసి అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల రెండో స్థానంలో ఉంది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తిరుమల శ్రీవారిని తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈ ఏడాది ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని…