TTD Vaikunta Ekadasi 2025 Tickets: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు తరలివస్తు ఉంటారు. శ్రీవారి ఆలయంలో ఏడాదికి పది రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతించే వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రతి హిందూ భక్తుడు పరితపిస్తూ ఉంటారు. దీనితో వైకుంఠ ద్వార దర్శనానికి డిమాండ్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూ వస్తూ ఉంది. ఈ ఏడాది కూడా టికెట్లు కలిగిన భక్తులను మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది టీటీడీ. గత ఏడాది తరహలోనే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్లను ముందస్తుగానే కేటాయించేలా ఏర్పాటు చేస్తుంది టీటీడీ.. ఆన్‌లైన్ సంబంధించిన టికెట్లను 23 ,24వ తేదీలలో విడుదల చేయగా ఆఫ్‌లైన్‌కు సంబంధించిన టికెట్లను జనవరి ఎనిమిదో తేదీ రాత్రి నుంచి విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు 18 వందల చొప్పున 10 రోజులకు సంబంధించి 18 వేల టికెట్లను విడుదల చేయగా.. పదివేల 500 విలువచేసే శ్రీవాణి టికెట్లను భక్తులు గంటన్నర సమయంలోనే కొనుగోలు చేసేశారు. ఇక, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి పది రోజులకు సంబంధించి 1,40,000 టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయగా కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే భక్తులు వాటిని కొనుగోలు చేసేశారు. లక్షా 40 వేల టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ కి 14 లక్షల హిట్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు.. స్వామివారి దర్శన టికెట్లకు ఉన్న డిమాండ్. కోటా ముగిసిన భక్తులు టిక్కెట్లు కోసం ప్రయత్నిస్తూనే వున్నారు.
Read Also: Pushpa 2: బాలీవుడ్ స్టార్ హీరోలకు బిగ్ టార్గెట్ ఇచ్చిన పుష్పరాజ్!
ఇక, సర్వదర్శనం భక్తులకు సంబంధించి ప్రతినిత్యం 40,000 చొప్పున 10 రోజులకు సంబంధించి నాలుగు లక్షల టికెట్లను ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసేలా టీటీడీ ఏర్పాటు చేస్తుంది. 8వ తేదీ రాత్రి ముందుగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, ఆ తర్వాత రోజులకు సంబంధించిన టికెట్లను 1,20,000 టికెట్లను తిరుపతిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ.. తిరుపతిలోని ఎనిమిది ప్రాంతాలతో పాటు తిరుమలలో ఒక ప్రాంతం కలిపి మొత్తంగా 91 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లను భక్తులకు జారీ చేసేలా టీటీడీ ముందస్తుగా ఏర్పాటు చేస్తుంది. అటు తర్వాత మిగిలిన ఏడు రోజులకు సంబంధించి ఏ రోజు ఆరోజు కోటాను ముందస్తుగా విడుదల చేయనున్నారు. దీంతో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ముందస్తుగానే తిరుపతికి చేరుకునే అవకాశం ఉంది.