తెలంగాణ ప్రజాప్రతినిధులకు శుభవార్త చెప్పింది టీటీడీ.. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు స్వీకరించబోతోంది టీటీడీ.. అయితే, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సోమవారం, మంగళవారాల్లో బ్రేక్ దర్శనాలు కల్పించనున్నారు టీటీడీ అధికారులు.. ఇక, బుధవారం ,గురువారం రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.