Tirupati Police: తిరుమలకు సొంత కార్లలో వెళ్తున్నారా..? అయితే, ఇది మీ కోసమే..
- తిరుమలకు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు..
- ఘాట్ రోడ్డులో కార్లు దగ్దంపై పలు సూచనలు జారీ చేసిన పోలీసులు..
- తిరుమలకు సొంత కార్లలో వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాలని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Police: తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇవాళ ( ఏప్రిల్ 21న) కీలక సూచనలు చేశారు. వేసవి దృష్ట్యా కార్లు దగ్ధం అవుతున్న ఘటనలు తిరుమల ఘాట్ రోడ్డులో పెరిగిపోతున్నాయి. దీంతో వాహనాలు నడిపేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు జారీ చేశారు. వీటిని తిరుమలకు సొంత కార్లలో వచ్చే భక్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Read Also: Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
కాగా, ఇటీవల వేసవి కాలంలో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని పోలీసులు తెలిపారు. అయితే, రెండు కార్లు పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు. ఈ విధంగా కార్లు దగ్ధమవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే పలు కారణాలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా వాహన చోదకులు పాటించాలన్నారు.
Read Also: Rani Mukerji : రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ ఫస్ట్ లుక్ అదిరింది!
కార్లలో మంటలు చెలరేగడానికి కారణాలు ఇవే:
1. దూర ప్రయాణం:
* 500 కిమీ లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది.
* తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్కు అధిక వేడి వస్తుంది.
2. కొండలు, వంకర రోడ్లు:
* ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం.
* డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది RPM పెరిగి వేడి పెరుగుతుంది.
* దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.
3. అధిక లోడుతో వెళ్ళే వాహనాలు:
* తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం.
* ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది.
4. వాహనాల మెయింటెన్స్ సరిగ్గా లేకపోవడం:
* పాత వాహనాలు లేదా సరిగ్గా సర్వీస్ చేయని వాహనాలు:
* కూలంట్ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్
* పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు
* ఫాల్టీ థర్మోస్టాట్లు
* పొడైపోయిన ఇంజిన్ ఆయిల్ వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి.. అలాగే, మంటలు చెలరేగడానికి కారణమవుతాయి.
5.ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు:
* ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు రావొచ్చు.
* దూర ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు, వైబ్రేషన్ల సమస్యలను పెంచుతుంది.
6. ఘాట్ రోడ్డులోకి ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం:
* కొంత మంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు.
* దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ స్మోక్ జరిగి మంటలు వ్యాప్తి..
*భద్రతా సూచనలు:*
* యాత్రకు బయలుదేరే ముందు బండిని సర్వీసింగ్ చేయించండి..
* ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్ చెక్ చేయాలి..
* రేడియేటర్ లీకేజీ తనికి చేయాలి..
* ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం..
* బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తనికి చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తూప్పును క్లీన్ చేయాలి..
* డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి ఐదు నిమిషాల పాటు నడక చేయడం, స్వల్ప వ్యాయామంతో పాటు ఎక్కువగా మంచినీరు తీసుకోవడం, టీ లేదా అల్పాహారం తీసుకోవాలి..
* డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దు..
* వెహికిల్ డ్యాష్ బోర్డు మీద ధర్మా మీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి, ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనికి చేసుకోవాలి.
* ఘాట్ రోడ్డు ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనానికి విశ్రాంతి ఇవ్వండి..
* వాహనం ఎక్కే సమయంలో AC ఆఫ్ చేయండి..
* కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి..
* బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడండి..
తాజావార్తలు
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!