Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డాడు. ఆయన ఒక్క సినిమాకు ఎంత తీసుకుంటాడు అనేది చాలా మందికి ఒక సస్పెన్స్. అయితే దీనిపై తాజాగా ప్రముఖ IMDB సంస్థ డైరెక్టర్ల రెమ్యునరేషన్ పై నివేదిక ఇచ్చింది. రాజమౌళి ఇండియాలోనే అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు ఎంత లేదన్నా రూ.200 కోట్ల తీసుకుంటున్నాడంట. రెమ్యునరేషన్, సినిమాలో ప్రాఫిట్స్ రూపంలో ఇది రాజమౌళికి వస్తోందంట. స్టార్ హీరోల కంటే రాజమౌళికే ఎక్కువ రెమ్యునరేషన్ అందుతోందని ఈ నివేదిక వెల్లడించింది. ఈ స్థాయిలో ఏ డైరెక్టర్ కూడా తీసుకోవట్లేదని నివేదిక వెల్లడించింది.
Read Also : Pravasthi Aradhya: కీరవాణి, సునీతపై సింగర్ సంచలన ఆరోపణలు..
మిగతా డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. ఆ తర్వాత సుకుమార్, రాజ్ కుమార్ హిరానీ రూ.80 కోట్ల దాకా తీసుకుంటున్నట్టు స్పష్టం చేస్తోంది ఈ నివేదిక. రాజమౌళి తీసుకునే రెమ్యునరేషన్ ఆయన స్థాయికి తగ్గట్టే ఉందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ఎందుకంటే రాజమౌళి తీసే ఒక్కో సినిమాకు వేల కోట్ల బిజినెస్ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆయన సినిమాలు వేల కోట్ల లాభాలు తెచ్చిపెడుతున్నాయి. కాబట్టి రాజమౌళి కష్టానికి ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు కొందరు నెటిజన్లు.