Rani Mukerji : రాణి ముఖర్జీ ‘మర్దానీ 3’ ఫస్ట్ లుక్ అదిరింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రాణి ముఖర్జీ అభిమానులకు శుభవార్త. చాలా కాలంగా చర్చలలో ఉన్న ‘మర్దానీ 3’ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మర్దానీ 3’ నుండి రాణి ముఖర్జీ ఫస్ట్ లుక్ సహా సినిమా విడుదల తేదీని మేకర్స్ విడుదల చేశారు. ధైర్యవంతురాలైన పోలీస్ ఆఫీసర్ శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణి ముఖర్జీ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారని మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియాలో యష్ రాజ్ ఫిల్మ్స్ షేర్ చేసిన ఫస్ట్ లుక్ లో, రాణి ముఖర్జీ నల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని చాలా మాసీ లుక్ లో కనిపించింది. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ YRF “మర్దానీ 3 కి కౌంట్‌డౌన్ ప్రారంభమయింది. శివానీ శివాజీ రాయ్ ఫిబ్రవరి 27, 2026న తిరిగి బిగ్ స్క్రీన్ మీదకు వస్తోంది.. హోలీ రోజున మంచి, చెడుతో పోరాడుతుంది” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చారు. 2026 మార్చి 4న హోలీ పండుగ జరుపుకోబోతున్న క్రమంలో అంతకన్నా కొద్దిరోజుల ముందే అంటే ఫిబ్రవరి 27న, రాణి ముఖర్జీ మరోసారి శివానీ శివాజీ రాయ్ గా థియేటర్లలోకి రానుంది.
Rajamouli : రాజమౌళి రెమ్యునరేషన్ రూ.200 కోట్లు.. IMDB నివేదిక..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘మర్దానీ 3’ 2014లో విడుదలైన రాణి ముఖర్జీ ‘మర్దానీ’ థర్డ్ ఎడిషన్. అంతకుముందు 2019లో ‘మర్దానీ 2’ థియేటర్లలో విడుదలైంది. ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా గట్టిగానే రాబట్టాయి. ఇప్పుడు మేకర్స్ మరోసారి ‘మర్దానీ 3’ కూడా ఆ స్థాయిలో హిట్ అవుతుందని ఆశిస్తున్నారు. 2014లో ‘మర్దానీ’ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు ఇండియాలో మొత్తం 48.11 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అది దాని బడ్జెట్ కంటే చాలా ఎక్కువ. ‘మర్దానీ’ తర్వాత దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత, ఆ సినిమా యొక్క తదుపరి భాగం ‘మర్దానీ 2’ పేరుతో విడుదలైంది. ఇందులో మరోసారి రాణి ముఖర్జీ శివానీ శివాజీ రాయ్ పాత్రలో కనిపించారు. ‘మర్దానీ’ లాగే ‘మర్దానీ 2’ కూడా బాగానే ఆడింది. ‘మర్దానీ 2’ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం 57 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది.
తాజావార్తలు
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?