Chandrababu Naidu: టీడీపీ అధినేత సంచలన వ్యాఖ్యలు.. ఇదే నాకు చివరి ఎన్నిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.. కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఇవే నాకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు.. మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే.. ఇదే నాకు చివరి ఎన్నిక అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచాయి… అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన… ఇప్పుడున్నది కౌరవ సభ అని ఆరోపించారు.. ఆ కౌరవ సభను.. నేను గౌరవ సభగా మారుస్తా అన్నారు. పత్తికొండలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. 2003లో నాపై 23 మందు పాతరలు పేలిస్తే వేంకటేశ్వరస్వామి కాపాడారని గుర్తుచేసుకున్నారు.. ఇప్పుడు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది.. ఆ ఆరాచక శక్తుల్ని తుదముట్టించాలని పిలుపునిచ్చారు. పోలీస్ శాఖలో కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు వస్తుందని.. తప్పులు చేస్తే వైఎస్ జగన్ కాపాడలేరని హెచ్చరించారు.
Read Also: Gujarat polls: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కిడ్నాప్‌లో కొత్త ట్విస్ట్.. అసలు ఏం జరిగిందంటే..?
Also Read
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
ఇక, కర్నూలు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ప్రకటించారు చంద్రబాబు.. మూడు రాజధానులు ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్న ఆయన.. రోడ్లు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా..? అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు భూమి ఇచ్చారని ఇళ్లన్నీ కూల్చేశారని మండిపడ్డారు.. ఆంబోతుల మెడలు వంచి కంట్రోల్ చేస్తా అన్నారు.. విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినపుడు చంద్రబాబు పెట్టిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శం అని వాళ్ల పార్టీ వాళ్ళతో చెప్పారన్నారు చంద్రబాబు.. నవ్య ఆంధ్రప్రదేశ్ 2029 నాటికి దేశంలో అగ్రస్థానంలో నిలపాలనకున్నా.. కానీ, వైఎస్ జగన్ ఒక్క ఛాన్న్ అన్న మాటకు ప్రజలు మోసపోయారు.. ఇప్పుడు జగన్ ఇచ్చేది గోరంత.. దోచేది మాత్రం కొండంత అని ఆరోపించారు. జగన్ ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.. జగన్ వచ్చాక ఒక్క పరిశ్రమ రాలేదని విమర్శించారు.
నేను ముఖ్యమంత్రిగా ఉంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఇప్పటికే వచ్చేదన్నారు చంద్రబాబు.. నేను ఇవాళ వచ్చా.. వైఎస్ జగన్‌ను రమ్మనండి అని సవాల్ విసిరారు.. పత్తికొండ ఎమ్మెల్యే పేటీఎమ్ బ్యాచ్‌ను పంపారు… నన్ను అడ్డుకోవడానికి.. కోడిగుడ్లు, రాళ్లు వేస్తే భయపడతానా…? అని మండిపడ్డారు.. మరోవైపు, టమోటాకి గిట్టుబాటు ధర లేదు.. ఉల్లికి గిట్టుబాటు ధర లేదు.. పత్తి నాసిరకం విత్తనాలతో నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాసిరకం మద్యం అమ్ముతున్నారు.. మద్యం అమ్మకాల్లోనూ పెద్ద కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు.. ఒక మంత్రి మద్యం వ్యాపారం చేస్తున్నారు.. జగన్ రాజకీయ వ్యాపారస్థుడు అని సంచలన ఆరోపణలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!