గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారం కలకలం సృష్టించింది.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిని కిడ్నాప్ చేసిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సూరత్ (తూర్పు) నియోజవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న కంచల్ జరీవాల్ కనిపించకుండా పోయారని ట్వీట్ చేసిన ఆయన.. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని కంచల్ జరీవాల్ పై ఒత్తిడి చేశారని, ఇప్పుడు కనిపించకుండా పోయారని రాసుకొచ్చారు. అయితే, ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అనూహ్యంగా ఆప్ అభ్యర్థి కంచన్ జరీవాల్ తెరపైకి వచ్చారు.. కిడ్నాప్ ఆరోపణలను కొట్టిపారేశారు. తనను ఎవరూ కిడ్నా ప్ చేయలేదని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.. తన మనస్సాక్షి చెప్పినట్టే చేశానని, స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు.. ఇక, ఇందులో ఎవరి ప్రమేయం లేదని, ఎవరూ ఒత్తిడి కూడా చేయలేది చెప్పుకొచ్చాడు.. దీంతో, ఆప్ నేతలకు షాక్ తగిలినట్టు అయ్యింది.
Read Also: Tiger Tension: బెంబేలెత్తిన పల్లెలు.. పులి పేరు చెబితేనే హడలిపోతున్నారు..
కాగా, సూరత్ (తూర్పు) నియోజవర్గ మా అభ్యర్థి కంచన్ జరివాలా, నిన్న సాయంత్రం నుంచి కనిపించకపోవడం, ఈ రోజు అనూహ్యంగా అతను నామినేషన్ ఉపసంహరించుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయంలో అధికార బీజేపీ నేతలే తమ అభ్యర్ధిని కిడ్నాప్ చేసి బలవంతంగా నామినేషన్ ఉప సంహరించేలా చేశారంటూ ఆప్ ఆరోపిస్తుంది. బీజేపీనే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటుందని ఆప్ నేతలు మండిపడ్డారు. అయితే కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొద్ది గంటలకే కంచన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ఆప్, బీజేపీ కార్యకర్తలు వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇక, బీజేపీ ఒత్తిడి వల్లే కంచన్ నామినేషన్ ఉపసంహరించుకున్నారనీ ఆప్ ఆరోపించగా.. అనూహ్యంగా వీడియో విడుదల చేసిన కంచన్ జరివాలా.. ఆప్ అభ్య ర్థిగా ప్రచారం చేసే సమయంలో నియోజకవర్గంలో చాలా మంది ప్రజలు తనను కేజ్రీవాల్ పార్టీ తరఫున పోటీ చేయొద్దని కోరారని.. తనను యాంటీ నేషనల్, యాంటీ గుజరాత్ అంటూ పిలిచారని.. అందుకే ప్రజల అభీష్టం మేరకే తన మనస్సాక్షి చెప్పేది పాటించి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొనడం గమనార్హం.