వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గోరంట్ల మాధవ్ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో లీక్ కావడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. మహిళా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉండే ఇంత చిల్లరగా వ్యవహరించడంపై అన్ని వర్గాలు మండిపడుతున్నాయి. అయితే, తనను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. వీడియోలో తాను ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారని.. ఏ విచారణకైనా, ఫోరెన్సిక్ టెస్టుకైనా సిద్ధమన్నారు. ఆ వీడియో నిజమని నిరూపించాలని సవాల్ విసిరారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవ్.. అయితే, గోరంట్ల మాధవ్ వీడియోపై విచారణ జరుగుతున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి..
Read Also: Covid Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని తెలిపారు.. విడియో వాస్తవమని తేలితే …ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని.. వీడియో వాస్తవమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని.. మహిళలు సంతోషంగా వుండాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దిశా చట్టాన్ని తీసుకువచ్చారని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. కాగా, ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. అది వాస్తవం కాదని, పోలీసు కేసు కూడా పెట్టానని గోరంట్ల తనతో చెప్పారన్నారు. ఆ విషయంలో నిజంగా ఆయన తప్పు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా పార్టీ మహిళల పక్షపాత పార్టీ. నిజంగా తప్పు ఉంటే మా నాయకుడు ఊరుకోరని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.