తెలంగాణలో ‘చీకోటి’ క్యాసినో కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. ఈడీ విచారణ రాజకీయ వేడిని పెంచుతోంది. విదేశాల్లో క్యాసినో అక్రమ నిర్వహణ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.
చికోటి ప్రవీణ్‌తో వైసీపీ నేతలకు కూడా సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర ఇళ్లలో కూడా ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు