తన తండ్రి, ఎంపీ రఘురామకృష్ణరాజును అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో హింసించారని ఆయన కుమారుడు.. భరత్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అక్రమ అరెస్టు, కస్టడీలో పోలీసులు పెట్టిన హింసపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.. అయితే ఆ రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.. దీనిపై 6 వారాలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.. ఇక, తదుపరి విచారణను ఆరు వారాలకు…
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసుపై ఆయనను ఇటీవల ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా, తనను కొట్టారంటూ ఆయన ఆరోపించడంతో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రఘురామకృష్ణంరాజు కూతురు ఇందు ప్రియదర్శిని, కుమారుడు భరత్ బుధవారం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రఘురామపై జగన్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలి చోటుచేసుకున్న పరిణామాలను అమిత్‌షాకు ఇందు…
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు విచారించనున్నారు. నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారిని లక్ష్యంగా…
ఎమ్పీ రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్ లోని అతని నివాసంలో అరెస్ట్ చేశాం అని సీఐడీ అడిషనల్ డీజీపీ తెలిపారు. కొన్ని వర్గాల పై హేట్ స్పీచెస్ చేశారని, ప్రభుత్వం పై అసంతృప్తి పెరిగే విధంగా మాట్లాడారని సమాచారం అని తెలిపిన అడిషనల్ డీజీపీ ప్రాధమిక విచారణ కు ఆదేశించారు. ఈ విచారణలో రఘురామ కృష్ణంరాజు కొంత కాలంగా వర్గాల మధ్య ఘర్షణలు పెంచేవిధంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రభుత్వం పై ప్రజల్లో విశ్వాసం పోయే విధంగా ముందస్తు ప్రణాళికతో…