ఏపీలో ప్రజాపోరు పేరుతో బీజేపీ జనంలోకి వెళుతోంది. రాబోయే ఎన్నికల నాటికి బీజేపీని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు కొత్తపేటలో బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ థియోధర్. చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను వేధించారు.. అందుకే జగన్ కు ప్రజలు ఓటు వేశారు.జగన్ ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలం అయ్యింది. జగన్ ప్రభుత్వం స్టిక్కర్ల పార్టీగా మారింది. మోడీ ఇచ్చిన పథకాలకు జగనన్న పథకాలు అంటూ స్టిక్కర్లు వేస్తున్నారు.
అమరావతి రైతులను చంద్రబాబే నాశనం చేశారు, చంద్రబాబుకు రాజధాని గురించి మాట్లాడే హక్కు, పాదయాత్రచేసే హక్కు టీడీపీకి లేదు. చంద్రబాబు నెంబర్‌వన్ క్రిమినల్, జగన్ నెంబర్ టూ. కర్నూలుకు హైకోర్టు ఇస్తామని కేంద్రప్రభుత్వం చెప్పింది.ఒక్కరాజధాని ఒక్క అవినీతి మూడు రాజధానులు మూడు అవినీతులు. రాజధానిని అభివృద్ది చేయాలని టీడీపి, వైసీపీకి లేదు.చర్చిలో ఫాస్టర్లకు ఇచ్చే డబ్బు ఎక్కడనుంచి వస్తుంది.హిందువులు ఇచ్చిన టాక్స్ డబ్బును చర్చి పాస్టర్లకు జీతాలుగా ఇస్తుంది.గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టాలి.ప్రజాపోరు యాత్రను చూచి జగన్ భయపడుతున్నారన్నారు సునీల్ థియోధర్.
Read ALso: Pakistan: పాకిస్తాన్‌లో డెంగ్యూ కలకలం.. ఈ ఏడాది 30 వేలకు పైగా కేసులు
తెనాలిలో ప్రచారరధాన్ని ఇద్దరు ముస్లిం యువకులు తగలబెట్టారు, వారిని అరెస్ట్ చేయాలి..రాష్ట్రంలో గుంటూరు, నెల్లూరు, అంతర్వేదిలో దేవాలయాలమీద దాడులు చేసిన వారిని ఎందుకు అరెస్టు చేయటంలేదు.సీఎం జగన్ యాంటీ హిందువు అని తేలిపోయింది.చంద్రబాబూ నీవు అధికారంలోకి వస్తే ఫాస్టర్లకు జీతాలు తీసివేస్తావా, మౌజిన్లకు జీతాలు రద్దు చేస్తావా,జిన్నాటవర్ పేరు మారుస్తావా.రాష్ట్రంలోకి గంజాయి,లిక్కర్ మాఫియా నడుస్తుంది.జనసేనతో కలసి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: khiladi lady: ఏడుగురిని పెళ్లాడిన కిలాడీ లేడి