Students: ఈ మధ్య రిలీజైన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలో మన్యంలో ఉండే అడవి బిడ్డల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించారు.. ఆ సినిమా ఎంతటి విషయం సాధించింది అనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పటికే అలా ఎన్నో గ్రామాలు ఉన్నాయి.. కనీస అవరాలకు దూరంగా బతుకు వెళ్లదీస్తున్నాయి.. ఇప్పటి ప్రజలు కష్టాలు వెళ్లదీయడమేకాదు.. నేటి బాలలు.. రేపటి పౌరులకు కూడా ఇవే ఇబ్బందులు.. మంచి భవిష్యత్ కోసం స్కూల్‌కు వెళ్లి.. చదువుకోవడం వారికి గగనంగా మారిపోయింది.. రోడ్లు లేక, కనీసం నడిచే తోవలు కూడా సరిగా లేక.. గుర్రాలను ఆశ్రయిస్తున్నారు చిన్నారులు.. అయితే, ఆ విద్యార్థుల కష్టాలు ఓ సామాజిక కార్యకర్త దృష్టిలో పడ్డాయి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఇప్పుడు ఆ చిన్నారుల కష్టాలు వైరల్‌గా మారిపోయాయి..
Read Also: Dharmana Prasada Rao: కావాలంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదిలేస్తా.. కానీ, గోంతెత్తకుండా ఉండను..!
ఇది ఎక్కడో అనుకుంటే పొరపాటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా సబ్ ప్లాన్ ఏరియాలో ఈ ఘటన వెలుగు చూసింది.. ఆ విద్యార్థుల కష్టాలకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రావికమతం మండలం గిరిశిఖర గ్రామమైన నేరేడు బందకు చెందిన విద్యార్థులు గుర్రాలపై పాఠశాలకు వెళ్తున్నారు. 15 మంది విద్యార్థులు పక్క గ్రామంలో పాఠశాలకు వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు.. వారి చిన్న పాదాలతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు.. దీంతో గుర్రాలపై జెడ్. జోగుంపేట పాఠశాలకు వెళ్తున్నారు విద్యార్థులు.. ఆ విద్యార్థులు గుర్రాలపై వెళ్లేందుకు స్థానికులు సాయం చేస్తున్నారు.. అయితే, ఒక్కో గుర్రంపై ముగ్గురు, నలుగురు, ఐదుగురు విద్యార్థులు.. ప్రమాదకరంగా వెళ్లాల్సిన పరిస్థితి.. తమకు రహదారి సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇటీవల గ్రామానికీ వెళ్లిన ఒక సామాజిక కార్యకర్త విద్యార్థుల కష్టాలను తన కెమెరాలో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పెట్టారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఈ చిన్నారుల బాధలను పట్టించుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు..