YS Jagan: అందుకే ఓడిపోయాం.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- వైసీపీ ఓటమిపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. మంచి చేసిన ఓడిపోయమన్న మాజీ సీఎం..
- చంద్రబాబు మోసపూరిత హామీలు ఇచ్చారు.. దాంతో 10 శాతం ఓట్లు ఆయనకు అదనంగా వచ్చాయన్న జగన్..
- నెల్లూరు సెంట్రల్ జైలులో పిన్నెల్లిని కలిసిన వైసీపీ అధినేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయ్యి.. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ములాఖత్లో కలిసిన ఆయన.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద 307 సెక్షన్ కింద కేసు పెట్టారు.. అన్యాయంగా జైల్లో నిర్బంధించారు.. రాష్ట్రవ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారు.. వాళ్లే దాడి చేసి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారు.. ఇంత దారుణంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏం చేశాడు.. కులం మతం ప్రాంతం చూడలేదు.. ఏ పార్టీకి ఓటు వేశారు అనే విషయాన్ని కూడా చూడకుండా అందరికీ ప్రభుత్వ పథకాలను ఇంటికి అందించామని గుర్తుచేసుకున్నారు.
Read Also: DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్ఫైర్, నో మిస్ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
అయితే, ఈరోజు టీడీపీకి ఓటు వేయలేదని మనుషులను కొట్టి కేసులు పెడుతున్నారు.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు.. వైయస్సార్ విగ్రహాలను పగలగొడుతున్నారు.. ఈ విధంగా దౌర్జన్యాలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు వైఎస్ జగన్.. ఇలానే పరిస్థితి కొనసాగితే చంద్రబాబుకు బుద్ధి చెబుతారు అని హెచ్చరించారు.. ప్రజలు ఎందుకు ఓటు వేశారు చంద్రబాబు ఆలోచించాలన్న ఆయన.. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదు.. ప్రజలకు మంచి చేసిన ఓడిపోయాం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు మోసపూరిత హామీలను ఇచ్చారు.. అందువల్లే 10 శాతం ఓట్లు ఆయనకు అధనంగా వచ్చాయి అన్నారు జగన్.. ఇక, రైతులకు భరోసా ఇస్తామని చెప్పారు.. ఇంతవరకు అతీగతి తెలియదు.. ఎంతమంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తానని చెప్పారు.. తల్లికి వందనం అని పేరు మార్చారు.. కానీ, ఆ డబ్బులు ఏమయ్యాయి? అని నిలదీశారు.
18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 15 వందల ఆర్థిక సాయం చేస్తామన్నారు.. వీటి మీద దృష్టి పెట్టే పని చంద్రబాబు చేయాలి.. ఇవేవి పట్టించుకోకుండా భయాందోళనలకు గురిచేస్తున్నారు అని ఆరోపించారు జగన్.. కారంపూడిలో ఘటన ఎన్నికలు జరిగిన మరుసటి రోజు జరిగింది.. డీఎస్పీ అనుమతి తీసుకుని దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు.. మే 14న ఘటన జరిగితే తొమ్మిది రోజుల తర్వాత రామకృష్ణారెడ్డి పై హత్యాయత్నం కేసు పెట్టారు.. ఒక పథకం ప్రకారమే కేసులు పెట్టారు.. ఎన్నికల రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో వద్ద జరిగిన ఘటన కేసు పెట్టారని.. దళితులను ఓటు వేయకుండా అడ్డుకున్నారు.. దాన్ని ప్రశ్నించేందుకు పిన్నెల్లి వెళ్లారు.. దానిపై కేసు పెట్టారని విమర్శించారు. సిట్ నివేదికలో ఏం జరిగిందో చెప్పలేదని ఫైర్ అయ్యారు.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి గెలిచారు.. మంచివాడు కాబట్టే కాదా? ఆయన విజయం సాధించింది..? అలాంటి వ్యక్తిని తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకూ ధర్మం? అని ప్రశ్నించారు. ఎల్లకాలం చంద్రబాబు అధికారంలో ఉండరు.. చంద్రబాబు పాపంపండుతుంది.. ప్రజల బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.. ఇదే మాదిరిగా కొనసాగితే ఇప్పుడు కొత్త సంప్రదాయానికి నాంది పలుకుతుంది.. ఈ రోజు ఏమైతా విత్తనం వేస్తావో అదే పండుతుంది.. చంద్రబాబు ఇప్పటికైనా ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..