US News: 19 ఏళ్ల యువకుడికి “హిందుత్వం”పై ఇంత ద్వేషమెందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US News: అమెరికాలో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని సామూహిక కాల్పులకు పాల్పడాలని కుట్ర పన్నిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇల్లినాయిస్లోని పలైటైన్లో నివసించే 19 ఏళ్ల అలెగ్జాండ్రోస్ పాపోరాకిస్ అనే యువకుడిని ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేశారు. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఆరోరా ప్రాంతంలోని ఏదైనా ఒక హిందూ ధార్మిక కేంద్రాన్ని అతడు టార్గెట్ చేయాలని ప్రణాళిక వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతడిపై ఉగ్రవాద బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఏ దేవాలయంపై దాడి చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. పలైటైన్ పోలీసుల సమాచారం ప్రకారం.. అక్టోబర్ 11న మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసుల నుంచి సామూహిక కాల్పులకు సంబంధించిన సమాచారం అందింది. పాపోరాకిస్ నుంచి తనకు కొన్ని ఆందోళనకరమైన ఎలక్ట్రానిక్ సందేశాలు అందాయని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విచారణలో భాగంగా నిందితుడు సామూహిక కాల్పుల పథకానికి సంబంధించిన ఒక పత్రంతో పాటు రైఫిల్, తూటాల గూళ్లు, బాడీ ఆర్మర్ తదితర ఆయుధాలు, వ్యూహాత్మక పరికరాల చిత్రాలను పంచుకున్నట్లు తేలింది. ఈ 19 ఏళ్ల కుర్రాడికి హిందుత్వంపై ఇంత పగ ఎందుకు పెంచుకున్నాడో విచారణలో తేలనుంది.
ఈ సమాచారం అందిన వెంటనే పలైటైన్, మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులు సంయుక్తంగా రంగంలోకి దిగారు. అక్టోబర్ 11 సాయంత్రం నిందితుడు తన ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడి నివాసంలో సోదాలు నిర్వహించగా ఒక రైఫిల్, నిండిన అనేక తూటాల గూళ్లు, వందలాది తూటాలు, వ్యూహాత్మక పరికరాలు, బాడీ ఆర్మర్ వెస్ట్ లభించాయి. ఆ వెస్ట్ మీద శ్వేతజాతీయ ఆధిపత్య తీవ్రవాదానికి సంబంధించిన గుర్తుతో ఉన్న ప్యాచ్ కూడా దొరికింది. ఈ విచారణ సమయంలో నిందితుడు రాసిన ఒక పత్రం పోలీసులకు లభించింది. ‘నేను ఎందుకు పోరాడాను: ఆరోరా షూటర్ ప్రకటన పత్రం’ అనే శీర్షికతో ఉన్న ఆ పత్రంలో శ్వేతజాతీయ ఆధిపత్య, తీవ్రవాద భావజాలంతో పాటు దక్షిణాసియా మూలాలున్న వ్యక్తులు, ముఖ్యంగా భారతీయులపై హింసకు పాల్పడాలనే ఉద్దేశం ఉన్నట్లు వెల్లడైంది. ఈ కేసు దర్యాప్తులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) షికాగో కార్యాలయం కూడా భాగస్వామ్యమైంది. ఉగ్రవాద హెచ్చరికల జారీ, నిర్ణీత పరిమితి కంటే తక్కువ పొడవున్న బ్యారెల్ కలిగిన రైఫిల్‌ను కలిగి ఉండటం వంటి అభియోగాలను పోలీసులు నిందితుడిపై మోపారు. అక్టోబర్ 14న జరిగిన విచారణ అనంతరం కోర్టు అతడిని కస్టడీలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 30కి ఖరారైంది.
Also Read
- Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- Donald Trump: "అబ్దుల్.. నువ్వొక జిహాదీవి".. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
తాజావార్తలు
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
-
Maserati Grecale: Maserati Grecale Facelift భారత్‌లో లాంచ్.. 530HP పవర్ఫుల్ ఇంజిన్, 285 kmph టాప్ స్పీడ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!