Dilraju : టాలెంట్ ఉన్న వారి కోసం సిద్ధమైన “దిల్ రాజు డ్రీమ్స్”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిల్ రాజు అనే పేరుకు తెలుగు సినీ పరిశ్రమలోనే కాక, యావత్ భారతీయ సినీ పరిశ్రమలో కూడా పరిచయం అవసరం లేదు. తన మొదటి సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న దిల్ రాజు టాలెంట్ కు కేరాఫ్ అడ్రస్. టాలెంట్ ఎక్కడ ఉన్నా ఆదరించే వ్యక్తిగా ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ ను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Janhvi Kapoor : కేన్స్‌లో మెదటి సారి తలుకుమన్న జాన్వీ..
Also Read
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
- Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
- Raaka : 'రాకా'లో త్రిపాత్రాభినయం చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ?
- Nagarjuna: బర్త్‌డే వేళ నాగార్జున ఫ్యాన్స్‌కు షాక్.. నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆ సినిమా ఔట్.. లాస్ట్ డేట్ ఇదే!
కొత్త టాలెంట్ ను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు దిల్ రాజు తాజాగా ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. తన కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెష్ కంటెంట్‌ను, టాలెంట్ ను ప్రోత్సహించే దిల్ రాజు ఇప్పుడు “దిల్ రాజు డ్రీమ్స్” ప్లాట్‌ఫామ్ ద్వారా యంగ్ టాలెంట్ ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారు. జూన్ నెల నుంచి ఆయన సిద్ధం చేసిన ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్ యాక్టివ్ కానుంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భాగం కావాలనుకునే వారు https://dilrajudreams.com/ లింక్‌పై క్లిక్ చేసి తమ వివరాలను నమోదు చేస్తే, దిల్ రాజు డ్రీమ్స్ బృందం స్వయంగా వారిని సంప్రదిస్తుంది.
Also Read: Nidhhi Agerwal : నిధి అగర్వాల్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
జూన్‌లో ఈ పోర్టల్ సిద్ధమైన తర్వాత, ‘దిల్ రాజు డ్రీమ్స్’ ద్వారా యువ ప్రతిభావంతులు తమ ఆలోచనలను ఈ బృందం దృష్టికి తీసుకెళ్లవచ్చు. తమ టాలెంట్ నిరూపించుకోవాలనుకునేవారు ఎంతోమంది సరైన ప్లాట్ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నారు. టాలెంట్ ఉన్నా సినీ పరిశ్రమలో కాంటాక్ట్స్ లేక, ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియక ముందుకు వెళ్లలేకపోతున్నారు. అలాంటి వారందరికీ ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. టాలెంట్ ఉన్నవారు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి దిల్ రాజు స్థాపించిందే ఈ దిల్ రాజు డ్రీమ్స్.. మరి ఇంకెందుకు ఆలస్యం? టాలెంట్ ఉండి, సినిమాలు చేయాలనే ఆలోచన ఉన్నవారు, సినీ పరిశ్రమలో అడుగు పెట్టాలనుకునేవారు, సినీ పరిశ్రమంలో భాగము కావాలనుకునేవారు దిల్ రాజు డ్రీమ్స్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని తమ కలను సాకారం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!