మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. మాజీ మంత్రి అనిల్ ని పుష్ప మూవీలో మంగళం శ్రీను తో పోల్చి విమర్శలు గుప్పించారు.. కరోనా సమయంలో ఓ హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి మాజీ మంత్రి అనిల్ లక్షల రూపాయలు దండుకున్నారు..
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.. మాజీ మంత్రి అనిల్ కుమార్ ఒక ఎక్స్‌ట్రా ఆర్టిస్ట్ అంటూ ఎద్దేవా చేశారు.. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్న ఆయన.. అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారని వెల్లడించారు..