మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి…
Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతానికి…పార్టీ హైకమాండ్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కమలం పార్టీకి వాస్తు సెట్ అవుతున్నట్టు లేదు. ఇతర పార్టీల్లో నుంచి ఏ నాయకుడు వచ్చినా ఎంత పెద్ద లీడర్ వచ్చినా.. లీడర్‌గా ఉంటున్నారే తప్పా…పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీలుకోలేకపోతున్నారు. అదే సమయంలో పార్టీలో నేతల నుంచి అంతంత మాత్రమే సహకారం అందుతోందనే భావన వ్యక్తం అవుతోంది. కన్నా లక్ష్మినారాయణ లాంటి సీనియర్ నేత కూడా పార్టీని వీడి…
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు…