ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల మరణించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఆనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే.. ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయడంలేదు. కానీ బీజేపీ, వైసీపీతో సహా 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే.. ఆత్మకూరు ఎన్నికలో సత్తా చాటేందుకు బీజేపీ, వైసీపీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
ఆంధ్రలో బీజేపీకి ఓటు ఎవరు వేస్తారని మంత్రి రోజా చెప్పడం సరికాదని ఆయన మండిపడ్డారు. ఆమె యాక్టర్..ఎవరో రాసిస్తే చదువుతారు అంటూ ఆయన విమర్శించారు. ఆమెకు ఏమి తెలీదని, తిరుపతి..బద్వేలు లలో ఓట్లు వచ్చాయిగా అని ఆయన గుర్తు చేశారు. మంత్రులను వెంబడిస్తామని.. మాకు భయపడే మంత్రులను, ఎమ్మెల్యేలను దింపారని ఆయన వ్యాఖ్యానించారు. బద్వేలులో కూడా లక్షన్నర ఓట్లు అని చెప్పారు. ఎన్ని వచ్చాయి. చూడండి అంటూ ఆయన గుర్తు చేశారు.