Andhra Pradesh: ఏపీ సీఎం జగన్‌ను కలిసిన ‘సేవ్ దేశీ కౌస్’ క్యాంపెయినర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్, క్లిమామ్ వ్యవస్థాపకురాలు అల్లోల దివ్యారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ, క్రాస్ బ్రీడింగ్ దేశవాళీ అవులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, కృత్రిమ గర్భధారణ పద్దతుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సేవ్ దేశీ కౌస్ ప్రచారంలో భాగంగా ఆమె సీఎం జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గోమయ గణపతి ప్రతిమను అందజేశారు. అంతేకాకుండా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన ప్రచార కార్యక్రమాలను వివరించారు.
విదేశాలకు చెందిన జెర్సీ, హాలిస్టిన్ వంటి హైబ్రిడ్ జాతులతో కృత్రిమ గర్భధారణ వల్ల మన దేశీ ఆవు జాతులు ఎన్నో అంతరించి పోతున్నాయని, కాలక్రమేణా మన దేశవాళీ ఆవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సీఎం జగన్‌కు అల్లోల దివ్యారెడ్డి వివరించారు. మన దేశ మేలు రకమైన ఆవులను అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు పెంచి పోషిస్తే.. మనం మాత్రం అధిక పాల దిగుబడి కోసం హైబ్రిడ్ జాతుల పోషణకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నాసిరకం పాలు మన పిల్లలకు ఇస్తున్నామని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అరికట్టాలని, స్వదేశీ జాతుల అభివృద్ధికి కృషి చేయాలని అభ్యర్థించారు. క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశీ ఆవుల ఉనికే ప్రమాదంలో పడిందని, క్రాస్ బ్రీడింగ్ పద్దతుల నివారణకు తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. తాను సుప్రీం కోర్టులో మే నెలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, ఈ పిల్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ లు జారీ చేసిందని సీఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించి దేశవాళీ అవుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ చెప్పారని అల్లోల దివ్యా రెడ్డి తెలిపారు.
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
- OTR : టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావుకు గడ్డుకాలమా? పార్టీలో తగ్గిన ప్రాధాన్యతపై చర్చ
- OTR : మంత్రి పార్థసారధిపై మైనింగ్ ఆరోపణలు.. నూజువీడులో రాజకీయ రగడ
Read Also: ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత సైజ్‌లో ఉండాలి?
అటు సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిని కూడా అల్లోల దివ్యారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. దేశీ జాతి ఆవులను సంరక్షించాలనే లక్ష్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టామని.. దీనికి మద్దతు నివ్వాలని భారతిని కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ముఖ్యంగా చిన్నపిల్లలకు స్వచ్ఛమైన ఏ2 మిల్క్‌ను అందించాలనే ఉద్దేశంతో పాటు హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యంతో పని చేస్తున్నట్లు ఆమెకు వివరించారు. కాగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం అల్లోల దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని వైఎస్ భారతి అభినందించారు.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!