వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంట్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి పూజిస్తారు

వీధుల్లోని మండపాలలో ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాలను ప్రతి ఏడాది సైజు పెంచుతుంటారు

అయితే ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత సైజ్‌లో ఉండాలనే విషయంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి.

ఇంట్లో పెద్ద వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయరాదు

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో పూజించే గణేష్ ప్రతిమలు 18 ఇంచులు లేదా ఒకటిన్నర అడుగు కంటే మించరాదు

గణపతి మట్టి విగ్రహంతో పూజిస్తే పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది

వినాయక చవితి రోజు గణపతిని 21 పత్రాలతో పూజిస్తారు

21 పత్రాలు:  మాచీపత్రం, గరిక తులసిపత్రం, దత్తూర పత్రం, బృహతీ పత్రం, అపామార్గ పత్రం,  బిల్వ పత్రం, బదరీ పత్రం చూత పత్రం, కరవీర పత్రం, మరువక పత్రం,  శమీ పత్రం విష్ణుక్రాంత పత్రం,  సింధువార పత్రం, అశ్వత్థ పత్రం,  దాడిమీ పత్రం, జాజి పత్రం, అర్జున పత్రం, దేవదారు పత్రం, గండలీ పత్రం, ఆర్కపత్రం

పూజించిన గణేష్ ప్రతిమలను మీ వీలును బట్టి 3, 5, 7, 9 రోజులలోనే నిమజ్జనం చేయాలి