ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మాటల యుద్దం సాగుతోంది. చంద్రబాబుకు పాలన చేత కాదని, అందుకే ప్రజలు బై బై బాబు అని ఇంటికి పంపించారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు పోటీలో ఎక్కడా లేడు. అధికారం అనేది ఇద్దరు వ్యక్తులు నిర్ణయించేదు కాదు… ప్రజలు నిర్ణయించాలన్న స్పృహ కూడా లేనట్లు ఉంది చంద్రబాబునాయుడికి అన్నారు సజ్జల. అధికారం అప్పనంగా రావటం వల్ల ఈ అహంకారం వచ్చిందన్నారు. తనకు తానే చివరి ఎన్నికలు అని చంద్రబాబు ఒప్పుకున్నాడన్నారు.
Read Also: FIFA World Cup: మెట్రోలో పాటలు, డ్రగ్స్, డ్రెస్ సరిగ్గా లేకున్నా జైలు పాలే
తన స్వంత నియోజకవర్గం కుప్పంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలుపుకోలేక పోయాడు. పులివెందుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబుపై ధ్వజమెత్తారు సజ్జల. ఇప్పటం విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించాలనున్న ప్రయత్నం మరోసారి బయటపడింది. కోర్టు తీర్పుతో ఈ విషయం తేలిపోయిందన్నారు. ఆక్రమణలను తొలగించటానికి అసలు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సభకు భూమి ఇచ్చిన వారిలో ఎవరి ఇల్లు కూలిందో పేర్లు ఇవ్వమంటే పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పటం లేదు?మైలవరం విషయంలో వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్ ఇద్దరూ మంచి నాయకులే. ఇద్దరితోనూ మాట్లాడాను. కింది స్థాయిలో అపోహలు ఉంటే తొలగించుకోవాలని చెప్పాను. అన్ని సద్దుమణుగుతాయన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
Read ALso: MP Rammohan Naidu: ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా.. ఏంటిది?