బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్…