ఈమధ్యకాలంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగడం, కొంతమంది ప్రాణాలు పోతుండడం, బైక్ లు ధ్వంసం కావడంతో తనిఖీలు పెంచారు పోలీసులు. బంజారాహిల్స్ పార్క్ హయత్ దగ్గర సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు చుక్కలు చూపించారు మందు బాబులు. రోడ్డు కు అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. కొంతమందిని పోలీసులు చూసీ చూడనట్లు…
విశాఖలో మరోమారు మత్స్యకారుల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రింగు వలల వివాదంతో నగరంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమవారిని విడిచిపెట్టాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. రోడ్డుపైకి వేల సంఖ్యలో గ్రామస్తులు వచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. మంత్రులు, అధికారులతో చర్చలు బాయ్‌కాట్ చేస్తున్నామని మత్స్యకార నాయకులు తెలిపారు. మత్స్యకారులు కలెక్టరేట్ ముట్టడికి ర్యాలీగా బయలు దేరగా అక్కడ మంత్రులు అప్పలరాజు, అవంతి వారితో చర్చలు జరిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని విడిచిపెట్టే వరకు…
అసలే కోతి.. కల్లు తాగిందంటారు. దీనికి ప్రతిరూపమే ఈ వ్యక్తి. అసలే తిక్క చేష్టలు చేసే వ్యక్తి పైగా మందు తాగాడు, మెడలో పాముతో బయటకు వచ్చాడు. డబ్బులివ్వాలని, లేదంటే పాముతో కరిపించేస్తానని ఒకటే గొడవ. సంగారెడ్డి జిల్లా గ్రేటర్ పరిధిలోని భారతీనగర్ డివిజన్లో తాగుబోతు హల్చల్ చేశాడు. మెడలో ఆరడుగుల పాము వేసుకుని ప్రతి ఒక్కరిని డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వని వారి పైన పాము వదులుతానని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం…
బుధవారం రాత్రి గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. అనుమానితులపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఐతానగర్ కు చెందిన నిందితుడు భరత్ కోసం పోలీసులు గాలించారు. పోలీసులను చూసి చెరువులో దూకి గత ఐదారు గంటలపాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు నిందితుడు భరత్. చెరువులో నుండి బయటకు రాగానే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. చెరువులో నుంచి పోలీసులకు దొరక్కుండా పారిపోయాడు రౌడీషీటర్ భరత్. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ రౌడీ షీటర్…