RJ Roja Fires On Chandrababu Naidu Over Amaravati Lands: ఏపీ మంత్రి ఆర్కే రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు పేదలకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు.. ఇప్పుడు జగనన్న ఇస్తుంటే సహించలేక పోతున్నారని మండిపడ్డారు. పేదలకు భూమి ఇస్తుంటే.. సమాధులు కట్టుకోవడానికా అని హేళనగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మహిళా కోరుకునే విధంగా సొంతింటి కల నెరవేర్చేందుకు జగనన్న ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని అన్నారు. సెంటు భూమి అంటే ఆడబిడ్డల సెంటిమెంటు అని జగనన్న నిరూపిస్తున్నారని చెప్పారు. దిగజారుడు మాటలు మాట్లాడిన టీడీపీ.. అదే సెంటు భూమిలో పాతిపెట్టాలని విరుచుకుపడ్డారు.
Powassan Virus Disease: “పోవాసాన్ వైరస్”తో యూఎస్‌లో ఒకరి మృతి.. పేల ద్వారా వైరస్ వ్యాప్తి..
అంతకుముందు కూడా.. రాజధాని ప్రాంతంలో ఉండే పేదలు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారా? వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదా? అంటూ చంద్రబాబుని మంత్రి రోజా నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబుని, టీడీపీని రాజకీయంగా పాతరేస్తారని జోస్యం చెప్పారు. ఆర్-5 జోన్‌లో ఇళ్ల పట్టాలకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని, ఆ ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావని పేర్కొ్న్నారు. పేదల ఇళ్లను సమాధులని సంబోధించడం దుర్మార్గమని.. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో.. చంద్రబాబు ఒక్క సెంటు భూమిని కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. పేదల పట్ల చంద్రబాబుకు జాలి లేదని, అహంకారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Seediri Appalaraju: మత్య్సకారుల్ని చంద్రబాబు మోసం చేస్తే.. జగన్ వారికి పెద్ద పీట వేశారు
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ మరోసారి అఖండ విజయం సాధిస్తుందని, 175 అసెంబ్లీ స్థానాల్లో తప్పకుండా విజయఢంకా మోగిస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ పాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని.. వాలంటీర్లను ప్రజలంతా మెచ్చుకుంటుంటే, చంద్రబాబు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని.. కేవలం ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 30 లక్షల మంది అక్కాచెల్లెళ్లకు తాము ఇళ్లు కూడా నిర్మించి ఇస్తున్నామని మంత్రి రోజు చెప్పుకొచ్చారు.