Minister Seediri Appalaraju Fires On Chandrababu Naidu Over Fishermen Issues: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మత్స్యకారులను దారుణంగా మోసం చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు ఆరోపణలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్స్యకారులు చంద్రబాబు దగ్గరకు వెళ్తే.. తోలు తీస్తామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం మత్స్యకారుల అభివృద్ధికి పెద్ద పీట వేశారన్నారు. మత్స్యకారులను చంద్రబాబు హేళన చేస్తే.. సీఎం జగన్ వారికి పదవులు ఇస్తున్నారన్నారు. మోపిదేవి వెంకటరమణను పార్లమెంట్‌కు పంపించారని.. అప్పలరాజు అనే తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. నలుగురు మత్స్యకారులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. రాజకీయంగా మత్స్యకారులకు జగన్ పెద్దపీట వేశారని, సీఎం జగన్ వల్లే మత్స్యకారుల జీవితాలు బాగుపడ్డాయని చెప్పారు. వేట విరామ సమయంలో దేశంలో ఎక్కడ కూడా రూ.5000లకు మించి ఇవ్వలేదని.. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రూ.10 వేలు ఇస్తున్నారని తెలిపారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మత్స్యకారుల తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు బెదిరించారని ఆరోపించారు. కానీ.. సీఎం జగన్ మాత్రం నాలుగుసార్లు మత్స్యకార భరోసా వేశారని, మత్స్యకారులంటే సీఎం జగన్‌కు ఎంతో ప్రేమ అని తెలియజేశారు. మత్స్యకారులకు మంత్రి, రాజ్యసభ పదవులు కట్టబెట్టారన్నారు. చంద్రబాబుకు మాత్రం పేదలంటే చులకన అని మండిపడ్డారు.
Peedika Rajanna Dora: టీడీపీ నాయకులకు రాజన్న సవాల్.. ఎంతమంది వచ్చినా నేను రెడీ
అంతకుముందు.. అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వకుండా చంద్రబాబు అనేక కుట్రలు చేవారని, కోర్టులో కేసులు కూడా వేశారని మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే.. బ్యాలెన్స్ తప్పుతుందని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పేదవారికి సెంట్ స్థలం ఇస్తే సమాధి అంటూ చంద్రబాబు మాట్లాడారని.. అదే సెంట్ స్థలంలో పేదలు చంద్రబాబును పూడ్చి పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. తాము కోర్టులో పోరాటం చేసి, అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామన్నారు. మొన్నటి వరకు కమ్మరావతి ఉండే అమరావతిలో ఇప్పుడు పేదలకు పట్టాలు ఇవ్వడం ద్వారా నిజమైన పండగ జరిగిందని పేర్కొన్నారు. సినిమా క్లైమాక్స్‌లో హీరో ఎలా విజయం సాధిస్తాడో.. తాము కూడా ఈ ఇళ్ల స్థలాల వ్యవహారంలో గెలుపొందామని పేర్కొన్నారు.
Extramarital Affair: ఆరుగురు పిల్లల తల్లి.. ప్రియుడి మోజులో ఎంత దారుణం చేసిందంటే?