చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు గ్రామాల్లో తిరుగుతూ విషం చిమ్ముతున్నారంటూ ఏపీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు అని ఆరోపించిన ఆమె.. ఒక్క చోట కూడా గెలవలేని పవన్, జగనన్నను ఓడిస్తాననడం సిగ్గు చేటన్నారు. పవన్ ఏమైనా దేవుడా లేక జ్యోతిష్యుడా? అంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయారని, కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం జగన్ తప్పించుకొని పారిపోలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎం…