మునుగోడు తీర్పు..తెలంగాణకు మార్పమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నీ తిట్టను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఇతర పార్టీల నుండి వచ్చిన రేవంత్ డబ్బులు పెట్టీ పీసీసీ కొన్నాడని విమర్శించారు. సీఎం కావాలని కోరిక రేవంత్ కి ఉందని, పథకం ప్రకారం కాంగ్రెస్ లోకి వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం అయ్యి రేవంత్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్ కి ఇవ్వలేదు..చంద్ర బాబు కి ఇచ్చి నాటకం చేయలేదా? అంటూ ప్రశ్నించారు. తన లాగా పార్టీకి పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు పోవల్సిందని తెలిపారు. సోనియా గాంధీని ఎప్పుడు నేను అగౌరవ పరచలేదని అన్నారు. బలి దేవత అని నువ్వే అన్నావు అని గుర్తు చేసారు. బీజేపీ, టీఆర్‌ఎస్, టీడీపీ నుండి నాలుగో పార్టీ కాంగ్రెస్ అంటూ ఎద్దేవ చేసారు. రేవంత్ నీకు వ్యక్తిత్వం ఉందా? అంటూ ప్రశ్నించారు.
read also: Undavalli Arun Kumar: నేను బతికి ఉండగా పోలవరం పూర్తవడం అసాధ్యం..!
జైల్ కి ఎందుకు పోయావు? తెలంగాణ ఉద్యమంలో జైల్ కి పోయావా? అంటూ ప్రశ్నించారు. ఆర్‌టీఐ కింద దరఖాస్తూ పెట్టీ డబ్బులు వసూలు చేసింది నువ్వు కాదా? అంటూ విమర్శించారు. వ్యాపారం లేకుండా డబ్బులు ఎట్లా సంపాదించావు అంటూ ప్రశ్నించారు. మేము వ్యాపారం చేశాము, మా బ్రాండ్ ఇమేజ్ మానవత్వంతో ఆడుకున్న రేవంత్ బ్రాండ్ బ్లాక్ మైలర్ అంటూ నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల ముసుగులో బ్లాక్ మెయిల్ చేస్తున్నావు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్త లెక్క ఆత్మగౌరవం చంపుకుని పని చేయమని అన్నారు. రేవంత్‌కు చరిత్ర లేదు, దొంగవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. చరిత్ర లేని మనిషి రేవంత్ అంటూ తీవ్రంగా విమర్శించారు. కాంట్రాక్ట్ కోసమే పార్టీ నుండి మారినట్టు నిరూపించు, నీరూపించకపోతే పీసీసీ కి రాజీనామా చెస్తావా అంటూ సవాల్ విసిరారు. రేవంత్ నిరూపిస్తే… నేను రాజకీయ సన్యాసం తీసుకుంట అంటూ రేవంత్ కి సవాల్ విసిరారు రాజగోపాల్ రెడ్డి. బీసీ లు రేవంత్ మీద కోపంగా ఉన్నారు, ఓ కులం కోసం మాట్లాడి అవమాన పరిచావని గుర్తుచేసారు.
పీసీసీ అయ్యాక ఇంటికి వస్తా అంటే.. వద్దు అన్నాను ఎందుకో తెలుసా.. నీలాంటి జైల్ కి వెళ్లి వచ్చిన వాడు ఇంటికి వస్తె మురికి అయితదని వద్దన్న అని వ్యాఖ్యానించారు. అందుకే బయట కలిశానని తెలిపారు. రేవంత్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ఎవరిని పండ పెట్టీ తొక్కుతవు రేవంత్, నువ్వు ఉన్నది ఎంతా మూడు ఫీట్లు.. నన్ను తొక్కుతవా? అంటూ ప్రశ్నించారు. మునుగోడు జనం చూస్తూ ఊరుకోరు.. ఎక్కడికి వెళ్ళినా జిందాబాద్ కొట్టించుకుంటవు, నిన్ను సీఎం గా తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ అప్పుల పాలు చేస్తే… రేవంత్ రాష్ట్రాన్ని అమ్మేస్తడు అంటూ మండిపడ్డారు. రేవంత్ చిల్లర దొంగ, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే మంచిగా ఉండదని హెచ్చరించారు. నీలాంటి వాళ్ళను చాలా మందిని చూశాం, హుజూరాబాద్ వెళ్లి ఏం పీకినవ్ అంటూ ప్రశ్నించారు. మునుగోడులో నువ్వు వస్తె డిపాజిట్ కూడా రాదు..! మునుగోడు కార్యకర్తలు నా వెంట ఉన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు లో డిపాజిట్ కూడా రాదంటూ ఎద్దేవ చేసారు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను ఎందరినో అవమాన పరిచావని, రేవంత్ అవకాశ వాద రాజకీయం చేస్తున్నావని ఎద్దేవ చేసారు.
Venkaiah Naidu: మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి.. ఎంపీలు, మంత్రులకు ఉపరాష్ట్రపతి సూచన