Four National Awards To Telangana In Tourism: పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన తెలంగాణ.. నాలుగు అవార్డులు అందుకున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా.. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో తెలంగాణను ఆ పురస్కారాలు వరించాయి. టూరిజం సమగ్ర అభివృద్ధి, ఉత్తమ గోల్ఫ్ కోర్స్ – హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్, ఉత్తమ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్, ఉత్తమ మెడికల్ టూరిజం ఫెసిలిటీగా అపోలో హాస్పిటల్స్ ఎంపికయ్యాయి. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ చేతుల మీదగా.. మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డుల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాలు పాల్గొన్నారు.
అవార్డులు అందుకున్న విభాగాలు:
1. Best State Comprehensive Development of Tourism
2. Best Golf Course Hyderabad Golf Club
3. Best Railway Station Secunderabad
4. Best Medical Toursim Facility Appollo Hospitals in Hyderabad