కరోనా సమయంలో ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారిపోయాయి జీవితాలు. నేను, నా కుటుంబం బతికుంటే చాలు అనుకునే స్థాయికి చేరుకున్నాయి. అయితే, ఇలాంటి సమయంలో ఓ మహిళ తన వీపుపై కరోనా రోగిని ఎక్కంచుకొని నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 24 ఏళ్ల మహిళ నిహారిక మామ కరోనా బారిన పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోన్నది. నగోల్ నగరం సమీపంలోని భాటీగ్రావ్ గ్రామంలో…
అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో…
ఇంతకుముందులా కరోనా సోకిన పేషెంట్లు.. సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటం లేదు. చాలా మంది వ్యక్తులు కరోనా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. కరోనా సోకినా కూడా బయటకు వస్తున్నారు. మరికొందరైతే తన వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కోవిడ్ పాజిటివ్ పేషెంట్ లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఓ మహిళ కు కోవిడ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో…
కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే.. వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక.. వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి.. కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.. ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్‌డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.. అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు…