ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో అంధకారం అలముకుంది. దాదాపు 10 గంటల పాటు పేషెంట్లు తీవ్ర అవస్థలు పడ్డారు. బాలింతలు గర్భిణీలు చంటి పిల్లలతో ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. మొబైల్ వెలుతురులో వైద్యం అందిస్తూ, కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వహిస్తూ నర్సింగ్ సిబ్బంది కూడా పడరాని పాట్లు పడ్డారు. ఉత్తరాంధ్ర పెద్దాసుపత్రికి గ్రహణం పట్టింది. మధ్యాహ్నం నుంచి విద్యుత్ నిలిచిపోవడంతో రోగులతో కిటకిటలాడే వార్డులన్నీ అంధకారంలో మగ్గిపోయాయి. చిమ్మ చీకటిలో రోగులు అల్లాడిపోయారు. రాజేంద్రప్రసాద్…
వందేళ్ళ చరిత్ర ఉన్న ధర్మాసుపత్రి విశాఖ కింగ్ జార్జి ఆస్పత్రి. బ్రిటీష్ కాలంలో నిర్మితమై…ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ సేవలతో విస్తరించింది. లక్షల మందికి వైద్యసేవలు అందిస్తున్న ఆ ఆసుపత్రి చుట్టూ ఇప్పుడు రాజకీయం మొదలైంది. శతాబ్ధ కాలం క్రితం పెట్టిన పేరును మార్చాలనే పొలిటికల్ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో తీవ్రస్ధాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్యప్రదాయిని. పేరుకి ధర్మాసుపత్రే కానీ కార్పొరేట్ స్ధాయి వైద్యం అందుతుంది. ఇటీవల కాలంలో KGH…
అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది విశాఖ కేజీహెచ్. తొలిసారిగా వెంటిలేటర్ పై ఉన్న గర్భిణీకి సిజేరియన్ చేసారు కేజీహెచ్ వైద్యులు. కరోనాతో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. కేజీహెచ్‌లో సీఎస్ఆర్ బ్లాక్‌లో ఉన్న 30 ఏళ్ల గర్భిణీకి గెనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కవిత ఆధ్వర్యంలోని బృందం ఈ ఉదయం శస్త్రచికిత్స చేసింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను సురక్షితంగా బయటకు తీసారు. శిశువుకి కరోనా టెస్ట్ నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు తెలిపారు. సిజేరియన్ తర్వాత ఆరోగ్యంతో…