నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని…
ఆలియా భట్, రణబీర్ కపూర్ జంటకు ప్రముఖ కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు తెలియచేసింది. సోమవారం ఆలియా భట్ తను గర్భం దాల్చినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కండోమ్ కంపెనీ డ్యూరెక్స్ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెబుతూ ‘మెహ్ ఫిల్ మే తేరీ.. హమ్ తో క్లియర్లీ నహీ థీ… (మీ మోహం మధ్యలో మేము అడ్డుగా లేము) ద జోమో ఈజ్ రియల్.. కంగ్రాట్స్ ఆలియా, రణ్ బీర్’ అని పోస్ట్ చేసింది. Read…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది. దీంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొన్న శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద…
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. జగన్ మూడేళ్ల పాలనలో ఏపీ పలు రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందని పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు. జగన్ డైనమిక్,…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ.. నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తు చేసుకున్నారు సీఎం కేసీఆర్.. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామన్నారు.. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార…