ఏపీలో వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలనపై 1,116 అక్రమాల పేరుతో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఛార్జిషీట్ విడుదల చేశారు. ఏపీలో విధ్వంసకర, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు గడుస్తోందని.. రివర్స్ టెండరింగ్ ఏపీని తిరోగమనంలోకి నెట్టిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ మంత్రులు నోరులేని మూగజీవులు అని చురకలు అంటించారు. కార్పొరేషన్‌లతో ఒక్కరికి ప్రయోజనం చేకూరిందని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. కోనసీమ అల్లర్లు సీఎం జగన్ స్పాన్సర్…
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి జగన్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పరిమళ్ నత్వానీ ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపారు. జగన్ మూడేళ్ల పాలనలో ఏపీ పలు రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందని పరిమళ్ నత్వానీ ట్వీట్ చేశారు. జగన్ డైనమిక్,…
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా…
సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. 175 సీట్లకు ఏకంగా 151 సీట్లలో ఘనవిజయం సాధించి మే 30, 2019న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 22 చోట్ల విజయకేతనాన్ని ఎగుర వేసింది. అంతకుముందు ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ 23 అసెంబ్లీ స్థానాలకు, మూడు లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోయినా జగన్ ప్రభుత్వం…