సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం అర్థరాత్రి ఒక కార్గో షిప్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత భారత నావికాదళం చర్యలు చేపట్టింది. ఈ దాడిపై ఓడ సిబ్బంది భారత నౌకాదళానికి అత్యవసర హెచ్చరిక (SOS) పంపింది. సమాచారం అందిన వెంటనే డిస్ట్రాయర్ యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నాన్ని పంపినట్లు భారత నావికాదళం వెల్లడించింది.
తూర్పు నావికాదళం నిర్వహిస్తున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ కి అంతా రెడీ అయింది. సోమవారం ఉదయం 9 గంటలకు రివ్యూ ప్రారంభం కానుంది. ఈ సమీక్షలో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రమే విశాఖ వచ్చారు. ఆయనకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి సీఎం జగన్ ప్రత్యేకంగా జ్ఞాపికను బహూకరించారు. 9కి ప్రారంభం కానున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ 9.07 కి…
సాగరతీరం విశాఖ అద్భుత కార్యక్రమానికి వేదికైంది. దేశ ప్రథమ పౌరుడు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో విశాఖలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించనున్నారు. వివిధ దేశాల నావికా దళ విన్యాసాలు అందరినీ కనువిందుచేయనున్నాయి. ప్రెసిడెంట్ ఫ్లీట్ లో ప్రత్యేక ఆకర్షణగా యుద్ద నౌక ఐ.ఎన్.ఎస్. విశాఖపట్నం, జలాంతర్గామి ఐ.ఎన్.ఎస్. వేల నిలవనున్నాయి. మొదటి సారి విశాఖపట్నం పేరును యుద్ధ నౌకకు పెట్టింది ఇండియన్ నేవీ. దీంతో సాగరతీరం పేరు దేశవిదేశాల్లో మారుమోగనుంది. మూడు నెలల…