పీఆర్సీ సాధన సమితి, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయి.. కానీ, ఇప్పుడు పీఆర్సీ సాధన సమితి నాయకులు ప్రభుత్వ ప్రతిపాదనలకు తల ఊపిరావడంపై కొందరు ఉద్యోగుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు చర్చలు విఫలం అయ్యాయి.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.. కలసివచ్చేవారితో ఉద్యమం ఉంటుందంటున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై కొందరు ఉద్యోగులుమండిపడుతున్నారు.. ఏకంగా పీఆర్సీ సాధన సమితి నాయకులకు పుష్పంజలి ఘటిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారంటే.. వారు…
పీఆర్సీ సాధన సమితి, ఏపీ ప్రభుత్వం మధ్య క్రమంగా దూరం పెరుగుతోంది.. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గేదేలేదంటున్నారు నేతలు.. చర్చలకు వెళ్లడానికి కూడా షరతులు పెడుతున్నారు.. ఈ నేపథ్యంలో.. సంచలన కామెంట్లు చేశారు పీఆర్సీ సాధన సమితి నేతలు… ఐఏఎస్‌లపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామంటూ హెచ్చరించారు.. మేం ఈ నెల 25వ తేదీన సంప్రదింపుల కమిటీతో మా స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చలకు వెళ్లి మా లేఖను ఇచ్చి వచ్చామని.. మేం పెద్ద కొర్కేలేమీ అడగలేదన్నారు పీఆర్సీ…
ఏపీలో పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యమం ఊపందుకుంటోంది. తాజాగా అమరావతి నుంచి ప్రారంభం అయిన ఉద్యమం విశాఖ సాగరతీరానికి చేరింది. విశాఖ జిల్లా స్ధాయిలోనూ ఉద్యోగ జేఏసీలు ఏకమయ్యాయి. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పాటయినట్టు సమితి కన్వీనర్ ఈశ్వర్రావు తెలిపారు. ఈనెల 25 న బైక్ ర్యాలీతో నగరమంతా నిరసన తెలుపుతామంటున్నారు. ఫిబ్రవరి 3 న ఛలో విజయవాడ తలపెట్టామన్నారు. తమ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లి వారి మద్దతు కూడగట్టుకుంటామన్నారు ఈశ్వరరావు. ఫిబ్రవరి 7 తేదీన…